నా కల నిజమైంది.. సోహైల్‌ పోస్ట్!

  • February 16, 2021 / 02:22 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొన్న వారిలో సోహైల్‌ ఒకడు. అప్పటివరకు సోహైల్‌ అంటే జనాలకు పెద్దగా తెలియదు కానీ బిగ్ బాస్ షోతో ఎనలేని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫైనల్స్ వరకు హౌస్ లోనే ఉండి సందడి చేశాడు. విన్నర్ కాకపోయినా.. ఆ రేంజ్ లోనే ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత సోహైల్‌ కి అవకాశాలు బాగానే వస్తున్నాయి. హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నాడు.

‘జార్జ్ రెడ్డి’, ‘ప్రెషర్ కుక్కర్’ లాంటి సినిమాలను నిర్మించిన అప్పిరెడ్డి సోహైల్‌ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీనివాస్‌ వింజనంపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తాజాగా సోహైల్‌ మరోసారి వార్తల్లోకెక్కారు. తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అదేంటంటే.. సోహైల్ కొత్త కారును కొనుగోలు చేశాడు. MG కంపెనీకి చెందిన ఖరీదైన కారుని సోహైల్ సొంతం చేసుకున్నాడు. దీని ధర రూ.30 లక్షల వరకు ఉంటుందని సమాచారం.

దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశాడు సోహైల్. తన తండ్రి, తమ్ముడు, స్నేహితులతో కలిసి కొత్త కారుతో ఫోటోలు దిగాడు. ఈ సందర్భంగా.. కొత్త కారు కొనాలనే కల నిజమైందని.. దీన్ని సాధ్యం చేసింనందుకు బిగ్ బాస్ కు, అలాగే తనకు ఎప్పుడు ఆదర్శంగా నిలిచే తన తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు.


Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus