Bigg Boss Telugu 6: గూగుల్ లెక్కల ప్రకారం బిగ్ బాస్ 6 విన్నర్ అతనేనా?

  • December 14, 2022 / 03:10 PM IST

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్ 6 విజేత రేవంత్ అవుతారని అందరూ భావిస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో పాటు రేవంత్ కు పోటీ ఇచ్చే కంటెస్టెంట్ లేకపోవడం వల్ల కూడా బిగ్ బాస్ సీజన్ 6 విజేత రేవంత్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. అయితే గూగుల్ మాత్రం రోహిత్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని చూపిస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

గూగుల్ గతంలో కూడా బిగ్ బాస్ విన్నర్ విషయంలో పొరపాట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే గూగుల్ పొరపాటును సరి చేసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు. గూగుల్ ఫిక్స్ అయినా విన్నర్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో రోహిత్ పేరు ఎక్కువగా వినిపిస్తుండటంతో గూగుల్ ఇలా చూపించి ఉండవచ్చని మరి కొందరు చెబుతున్నారు. మరోవైపు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలుస్తారని బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్లకు కూడా తెలుసు.

అందువల్ల ఈసారి బిగ్ బాస్ సూట్ కేస్ ద్వారా ఇచ్చే ఆఫర్లకు సైతం కంటెస్టెంట్లు ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. గత సీజన్ల గురించి అవగాహన ఉండటంతో కంటెస్టెంట్లు బిగ్ బాస్ ఇచ్చే ఆఫర్ కు నో చెప్పే అవకాశం లేదు. శ్రీ సత్య ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చే సూట్ కేస్ గురించి హౌస్ మేట్స్ తో చర్చిస్తున్న సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ కు భారీ ఆఫర్లు కూడా ఉండగా రేవంత్ విజేత అనే విధంగా బిగ్ బాస్ ఇప్పటికే పలు సంకేతాలను ఇచ్చారు. బిగ్ బాస్ 6 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారని తెలుస్తోంది. లాస్ట్ ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యే సెలబ్రిటీ ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. బిగ్ బాస్ సీజన్ 6 గత సీజన్లతో పోల్చి చూస్తే ఆశించిన స్థాయిలో రేటింగ్స్ ను సొంతం చేసుకోలేదు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus