హార్ట్ ఎటాక్ తో మరణించిన ‘బిగ్ బాస్’ విన్నర్.!

  • September 2, 2021 / 12:15 PM IST

ప్రముఖ బిగ్ బాస్ విన్నర్ మరణించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. అయితే తెలుగు బిగ్ బాస్ లో కాదు లెండి. వివరాల్లోకి వెళితే… హిందీ బిగ్ బాస్ సీజన్ 13 విన్నర్ అయిన సిద్ధార్థ్ శుక్లా గుండెపోటుతో మరణించడం బాలీవుడ్ జనాలను విషాదంలోకి నెట్టేసింది. ఇతని వయసు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే కావడం గమనార్హం. గతంలో ఇతను పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించాడు. బిగ్ బాస్‌తో సిద్ధార్థ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది.

‘హంపీ శర్మ కి దుల్హనియా’ ‘బిజినెస్ ఇన్ ఖజికిస్తాన్’ వంటి చిత్రాల్లో ఇతను సహాయ పాత్రలు పోషించాడు. అయితే వెండితెర పై కంటే బుల్లితెర పైనే ఇతను మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ‘బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్’ అనే వెబ్ సిరీస్ లో కూడా ఇతను నటించాడు. అంతేకాకుండా ‘బిగ్ బాస్ 14’ కు సంబంధించి 16వ వారానికి గాను ఇతను హోస్ట్ గా కూడా వ్యవహరించడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయ్యింది.

ఇదిలా ఉండగా.. నిండా 40 ఏళ్ళు కూడా నిండకుండానే ఇతను ఊహించని విధంగా మరణించడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా షాక్ అవుతున్నారు. ఇతను ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఎటువంటి అనారోగ్యానికి ఇతను గురికాలేదు.ఇటీవల పలు పెద్ద సినిమాలకు కూడా ఇతన్ని సంప్రదించారట. ఆ ఆఫర్లు కూడా ఇతనికి ఓకే అయ్యే ఛాన్స్ ఉండగా ఇతను మరణించడం నిజంగా విషాదకరం అనే చెప్పాలి.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus