Mallidi Vasishta: బింబిసార సక్సెస్ తో వశిష్ట రెమ్యునరేషన్ పెరిగిందా?

Advertisement

ఈ ఏడాది థియేటర్లలో విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సినిమాలలో బింబిసార సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మూడో వీకెండ్ లో కూడా ఈ సినిమా బాగానే కలెక్షన్లను సాధించడం గమనార్హం. బింబిసార సినిమాకు వశిష్ట తక్కువ పారితోషికానికే పని చేశారు. ఈ సినిమాకు నెలవారీ జీతం తీసుకున్న వశిష్ట సినిమా రిలీజైన తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో పారితోషికం అందుకున్నారు.

బింబిసార2 సినిమాకు వశిష్టకు 3 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ దక్కనుందని తెలుస్తోంది. తన టాలెంట్ తో వశిష్ట ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. బింబిసార2 సినిమా కూడా సక్సెస్ సాధిస్తే వశిష్ట పారితోషికం మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. బింబిసార2 రిలీజ్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది. కళ్యాణ్ రామ్ ఒకవైపు డెవిల్ సినిమాలో మరోవైపు బింబిసార2 సినిమాలో నటించనున్నారు.

బింబిసార సినిమాకు ఇప్పటివరకు 35 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఈ సినిమా మరో రెండు నుంచి మూడు కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ లో ఏ సినిమా అందించని స్థాయిలో ఈ సినిమా లాభాలను అందించడం గమనార్హం. ఆగష్టు నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలలో బింబిసార, సీతారామం, కార్తికేయ2 సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి ఘనవిజయం సాధించాయి.

లైగర్ సినిమా కూడా సక్సెస్ సాధించి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. ఈ ఏడాది సెకండాఫ్ లో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలే ఎక్కువగా విడుదలవుతుండగా కొత్తదనంతో తెరకెక్కిన సినిమాలన్నీ ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news