Bimbisara: కళ్యాణ్ రామ్ మూవీ అక్కడ కూడా హిట్టవుతుందా?

  • December 26, 2022 / 11:32 AM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది బింబిసార సినిమాతో సక్సెస్ ను అందుకున్నారు. కొత్త దర్శకుడు మల్లిడి వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పించడం గమనార్హం. ఈ సినిమా ఫుల్ రన్ లో 40 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించి నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన కేథరిన్, సంయుక్త మీనన్ లకు కూడా ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఈ సినిమా జీ5 ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే త్వరలో ఈ సినిమా బుల్లితెరపై ప్రసారం కానుంది. అతి త్వరలో ఛానల్ నిర్వాహకులు ఈ సినిమా ప్రసారానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు. అయితే కళ్యాణ్ రామ్ బుల్లితెరపై ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ఈ సినిమా మంచి రేటింగ్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మరోవైపు బింబిసార2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బింబిసార2 సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. హిందీలో కూడా బింబిసార2 మూవీని రిలీజ్ చేస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బింబిసార2 మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం అందుతోంది.

మల్లిడి వశిష్ట ఖర్చు విషయంలో రాజీ పడకుండా ఈ సినిమాను తెరకెక్కించనున్నారని బోగట్టా. ఈ సినిమా షూటింగ్ కు సంబంధించి త్వరలో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బింబిసార2 కూడా సక్సెస్ సాధిస్తే మల్లిడి వశిష్ట స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరినట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. రజనీకాంత్, బాలయ్యలతో వశిష్ట తర్వాత ప్రాజెక్ట్ లు తెరకెక్కనున్నాయని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus