Karthik Aryan: నటుడు కార్తీక్ ఆర్యన్ కొనుగోలు చేసిన ఫ్లాట్ ఖరీదు ఏంతో తెలుసా?

  • July 8, 2023 / 08:48 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎన్నో సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఈ మధ్యకాలంలో వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈయన సత్య ప్రేమ్ కి కథ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కియారా అద్వానీ నటించారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బాలీవుడ్ సెలబ్రిటీలు వరుస సినిమాలలో నటిస్తూ ముంబైలోని ఖరీదైన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలు ఖరీదైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే నటుడు కార్తీక్ ఆర్యన్ సైతం ముంబైలోని జూహు ప్రాంతంలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. కార్తీక్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్ ఖరీదు 17.50 కోట్ల రూపాయలని తెలుస్తుంది.

అన్ని సదుపాయాలతో ఎంతో విలాసవంతమైన ఈ భవనాన్ని (Karthik Aryan) కార్తీక్ ఆర్యన్ జూన్ 30వ తేదీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక కార్తీక్ తల్లి ఈ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి డీల్ కుదిర్చినట్టు సమాచారం. ఇలా ఈయన ముంబైలోని టాప్ సెలబ్రిటీలు కొనుగోలు చేసిన ప్రాంతంలో ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేశారని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం కెప్టెన్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus