అలనాటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైంది జాన్వీ కపూర్ .. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత మరో సినిమాలో నటించింది. ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది.. సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువే.. తాజాగా నెట్టింట ఓ వార్త వైరల్ అవుతుంది.. ఈ అమ్మడు తెలుగింటి కోడలు కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ప్రస్తుతం దేవర లో నటిస్తుంది..ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ సినిమాలో కూడా జాన్వీ కపూర్ నటించబోతుందని సమాచారం. దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించిన శ్రీదేవి తనయిరాలిగా జాన్వీ కపూర్ కి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ సినిమాలపరంగా మాత్రం ఈమె బాలీవుడ్ లో నటించిన ఏ సినిమా కూడా అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.. తాజాగా జాన్వీ కపూర్ గురించి టాలీవుడ్ లో ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే జాన్వీ కపూర్ మరికొన్ని రోజుల్లో తెలుగింటికి కోడలుగా వెళ్లబోతుంది అంటూ ఇండస్ట్రీలో ఒక టాక్ వినిపిస్తోంది.
ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం (Actress) జాన్వీ కపూర్ టాలీవుడ్ స్టార్ హీరోని ప్రేమిస్తుందట.. అతన్నే పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట.. అయితే..ఆ స్టార్ హీరోకి తెలుసో లేదో కానీ చాలామంది దర్శక నిర్మాతలు ఆమె దగ్గరికి వస్తే ఆ స్టార్ హీరో సినిమాలో నేను చేస్తాను అంటూ ఓపెన్ గానే చెప్పేస్తుందట. అంతేకాదు గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు అవకాశం వస్తే ఆ హీరోతో డేటింగ్ చేయడానికి కూడా వెనకాడను అంటూ చెప్పడంతో ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది..
జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్స్ విషయంలో అంతా సీరియస్ గా తీసుకోకుండా ఎంజాయ్ చేస్తూ పోతుందట. బాలీవుడ్ ప్రియుడిని వదిలేసి టాలీవుడ్ లో ఆ హీరో ప్రేమ కోసం సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త పై నెట్టింట్లో పెద్ద చర్చే జరుగుతుంది..
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!