NBK108: పాన్‌ ఇండియా లుక్‌ కోసం అనిల్‌ ఇలా చేస్తున్నారా? ఆ రిలీజ్‌ ఉంటుందా?

  • April 24, 2023 / 05:05 PM IST

నందమూరి బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమాకు పాన్‌ ఇండియా రంగులు పులమాలని చూస్తున్నారా? ఏమో టీమ్‌ ఆలోచనలు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. తెలుగు నటుణ్ని తీసుకోవాలని అనుకున్న పాత్ర కోసం ఇప్పుడు బాలీవుడ్‌ హీరోను తీసుకుంటున్నారని సమాచారం. గత కొన్ని రోజులుగా టాలీవుడ్‌లో ఈ విషయమ్మీదే చర్చ జరుగుతోంది. సినిమాలో విలన్‌ పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్‌ నటుణ్ని తీసుకుంటున్నారని టాక్‌ నడుస్తోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఇస్తారని సమాచారం.

టాలీవుడ్‌ హీరోలు అప్పుడప్పుడు బాలీవుడ్‌ వెళ్లి చిన్న చిన్న పాత్రలు, స్పెషల్‌ క్యారెక్టర్లు చేయడం చూశాం. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియా పరిస్థితులు బలంగా రావడంతో పరిస్థితి మారిపోయింది. బాలీవుడ్‌ చూపు మనవైపు తిరిగింది. మన కథలు తీసుకెళ్తున్నారు, మన దర్శకులు అటు వెళ్తున్నారు. ఆఖరికి వాళ్లే ఇక్కడకు పాత్రలు చేయడానికి వస్తున్నారు. బాలీవుడ్‌ నటులు సౌత్‌వైపు వచ్చి సినిమాలు చేయడం మనం గతంలోనూ చూశాం. అయితే అక్కడి హీరోలు ఇక్కడకు వచ్చి హీరో కాని పాత్రలు చేయడం తక్కువ.

ఇప్పుడు ఇదే కోవలో బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ టాలీవుడ్‌కి వస్తున్నాడట. (NBK108) బాలయ్య – అనిల్‌ సినిమాలో అర్జున్‌ విలన్‌గా నటిస్తాడని సమాచారం. తొలుత ఈ పాత్ర కోసం తారకరత్నను అనుకున్నారని.. అయితే ఆయన దివంగతులు కావడంతో ఆ పాత్రను బాలీవుడ్‌ హీరోతో ఫిల్‌ చేస్తున్నారని అంటున్నారు. ఆ పాత్రలో ఉన్న పవర్‌ను అర్జున్‌ అయితే బాగా హ్యాండిల్‌ చేస్తాడని వాళ్ల నమ్మకం అంటున్నారు. ఎందుకు, ఏమిటి అనే కారణాలు పక్కన పెడితే.. అర్జున్‌ రాక అయితే పక్కా అంటున్నారు.

ఒకవేళ అదే జరిగితే అన్నాచెల్లెళ్లు ఒకే కుటుంబం హీరోల సినిమాలతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లు అవుతుంది. తారక్‌తో జాన్వీ నటిస్తుండగా, బాలయ్యతో అర్జున్‌ నటిస్తున్నాడు. మరోవైపు సైఫ్‌ అలీ ఖాన్‌ కూడా తారక్‌ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా చాలామంది ఇలా సౌత్‌ బాట పడతారు అని సమాచారం.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus