బోయపాటి ప్లానింగ్ మామూలుగా ఉండదు మరి..!

Advertisement

నందమూరి బాలకృష్ణ  (Nandamuri Balakrishna), దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) ..లది ఆల్ టైం హిట్ కాంబినేషన్. 2010 కి ముందు ‘ఫేడౌట్ దశకి దగ్గరయ్యాడు’ అని అంతా బాలయ్య గురించి అనుకుంటున్న టైంలో ‘సింహా’ (Simha) వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి ఆదుకున్నాడు బోయపాటి శ్రీను. అటు తర్వాత మళ్ళీ బాలయ్య సినిమాలకి డిమాండ్ పెరిగింది. ‘శ్రీరామరాజ్యం’ (Sri Rama Rajyam) వంటి హిట్ కొట్టినా.. మిగిలిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అలాంటి టైంలో మళ్ళీ అతనికి హిట్ ఇచ్చింది బోయపాటినే..!

Akhanda 3

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 2వ సినిమా ‘లెజెండ్’ (Legend) బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ తర్వాత మళ్ళీ బాలయ్యకి ప్లాపులు వచ్చాయి. మరోపక్క కోవిడ్ కూడా వచ్చింది. ఇలాంటి టైంలో బాలయ్యతో ‘అఖండ'(Akhanda) చేశాడు. కోవిడ్ టైంలో రిలీజ్ అయిన ఈ సినిమా పెద్ద హిట్ అయ్యింది. టికెట్ రేట్లు తక్కువగా ఉన్న టైంలో కూడా భారీ వసూళ్లు సాధించింది ‘అఖండ’. ఇక ‘అఖండ’ కి సీక్వెల్ కూడా ఉంటుందని టీం ముందుగానే ప్రకటించింది.

వారు చెప్పినట్టుగానే ‘అఖండ 2’ (Akhanda 2) కూడా మొదలైంది. ఆల్రెడీ ఈ చిత్రం షూటింగ్ 50 శాతం పూర్తయ్యింది. సెప్టెంబర్ 25న రిలీజ్ చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అనుకున్న డేట్ కి సినిమాని రిలీజ్ చేయాలని టీం అహర్నిశలు పనిచేస్తుంది. ఒకవేళ అదే డేట్ కి కనుక వస్తే.. ఈ మధ్య కాలంలో అంటే కోవిడ్ తర్వాత చెప్పిన డేట్ కి రిలీజ్ చేసిన పెద్ద సినిమా ‘అఖండ 2’ అవుతుంది.

ఇదిలా ఉంటే.. ‘అఖండ’ జర్నీ ‘అఖండ 2’ తో పూర్తయిపోదట. మరో భాగం కూడా ఉంటుందట. ‘అఖండ 2’ క్లైమాక్స్ లో పార్ట్ 3 కి సంబంధించిన లీడ్ ఇస్తారట. అక్కడ ఓ ఊహించని పాత్ర ఎంట్రీ ఉంటుందట. దాని బ్యాక్ స్టోరీతో ‘అఖండ 3’ (Akhanda 3) ఉంటుంది అని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus