Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా ‘దేవర 2’ రూపొందనుంది. అలాగే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ‘డ్రాగన్’ కూడా రాబోతుంది. రెండూ పాన్ ఇండియా ప్రాజెక్టులే. మధ్యలో ‘వార్ 2’ (War 2) కూడా చేశాడు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో హృతిక్ రోషన్ (Hrithik Roshan)  మెయిన్ హీరోగా చేయగా.. ఎన్టీఆర్ సెకండ్ హీరోగా అతి ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. బాలీవుడ్లో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. బాలీవుడ్ జనాలకి మరింత దగ్గరయ్యి అక్కడ తన మార్కెట్ పెంచుకునేందుకు ఎన్టీఆర్ కు దొరికిన సువర్ణావకాశం ఇది.

Hrithik Roshan

అయితే ‘వార్ 2’ సంబంధించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం ఓ గిఫ్ట్ ఇస్తానంటున్నాడు హృతిక్ రోషన్ (Hrithik Roshan). ”తారక్.. ఈ మే 20న ఏం జరగబోతుందో నీకు తెలుసా? నీకు తెలియదు మేము ఏం దాచామో. ‘వార్ 2’ కోసం సిద్ధంగా ఉండండి” అంటూ హృతిక్ రోష‌న్ ట్విట్టర్లో సరదాగా రాసుకొచ్చాడు. హృతిక్ రోషన్ ట్వీట్లో ఉన్న అర్థం అందరూ గ్రహించే ఉంటారు. మే 20 న ఎన్టీఆర్ పుట్టినరోజు. అంటే అభిమానులకు అదో పెద్ద పండుగ రోజు.

ప్రపంచంలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు అంతా..తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎన్టీఆర్ తో సినిమాలు తీస్తున్న దర్శకనిర్మాతలు గిఫ్ట్స్ ఇవ్వకపోతే ఎలా చెప్పండి. అందుకే ముందుగా ‘వార్ 2’ టీంకి సంబంధించి హృతిక్ స్పందించి ఆ రోజు స్పెషల్ టీజర్ ఉండబోతుంది అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. అతని ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది.

సెప్టెంబర్లో మరో పాన్ ఇండియా సినిమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus