Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

శ్రీవిష్ణు (Sree Vishnu) పై క్రైస్తవ సంఘాలు మండి పడుతున్నాయి. అతని సినిమాలను బ్యాన్ చేయాలని కూడా పిలుపునిచ్చాయి. వివరాల్లోకి వెళితే.. శ్రీవిష్ణు గత 2,3 సినిమాల నుండి క్రైస్తవ మతాన్ని, యేసు ప్రభువును కించపరుస్తున్నారని ఆరోపిస్తున్నాయి క్రైస్తవ సంఘాలు. ‘శ్వాగ్'(Swag)  ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush)  ‘సింగిల్’ (#Single)  వంటి సినిమాల్లో యేసు క్రీస్తుని, క్రైస్తవ మతానికి చెందిన వారిని అగౌరవ పరుస్తూ సన్నివేశాలు ఉన్నాయని. క్రైస్తవులంటే అంత చులకన భావన ఎందుకని? ‘ఇతర మతాల్లో ఎలాంటి లోపాలు ఉండవా?

Sree Vishnu

అసలు క్రైస్తవత్వం తో మీకు వచ్చిన సమస్య ఏంటి? ఇక నుండి మీ సినిమాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్టు’ క్రైస్తవ సంఘానికి చెందిన పెద్దలు శ్రీవిష్ణుని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయం పై శ్రీ విష్ణు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో చూడాలి. ‘ఓం భీమ్ బుష్’ సినిమాలో ‘అదేంటో నాకెలా తెలుస్తుంది. నేనేమైనా యేసు ప్రభువునా?’ అంటూ శ్రీవిష్ణు పలుకుతారు. ఇక ‘శ్వాగ్’ సినిమాలో అయితే క్రైస్తవులు పెట్టుకునే స్వస్థత సభల్లో పాస్టర్లు చేసే ప్రార్థనలను..

కామెడీ కోసం పేరడీ చేయడం జరిగింది. ఇక ‘సింగిల్’ సినిమాలో కూడా ‘దేవుడున్నాడు.. యేసు తండ్రి ఉన్నాడు’ అంటూ శ్రీవిష్ణు కొంచెం వ్యంగ్యంగా పలకడం కూడా చర్చనీయాంశం అయ్యింది. వీటిని దృష్టిలో పెట్టుకునే క్రైస్తవ సంఘాలు శ్రీవిష్ణు పై అలాగే అతని సినిమాలపై మండిపడుతున్నారు అని స్పష్టమవుతుంది.

మరి ఈ విషయంపై శ్రీవిష్ణు ఎలా స్పందిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. మొన్నటికి మొన్న ‘సింగిల్’ ట్రైలర్ తో మంచు విష్ణు కూడా హర్ట్ అయితే.. శ్రీవిష్ణు మీడియా ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాడు.

ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus