బాలయ్య అఘోరా నేపథ్యం అదిరిపోతుందట

Advertisement

బాలయ్య బోయపాటి సినిమాపై అంచనాలు ఫ్యాన్స్ లో భారీగా ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన సింహ, లెజెండ్ హిట్ కావడంతో బాలయ్య ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక బాలయ్య సరైన హిట్ అందుకొని చాలా కాలం అవుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన ఈ సినిమాతో ఫార్మ్ లోకి వస్తారని ఆయన అభిమానులు విశ్వాసంతో ఉన్నారు. కాగా డైరెక్టర్ బోయపాటి శ్రీను తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీకి సంబంధించిన అనేక విశేషాలు పంచుకున్నారు.

ఆయన పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఈ మూవీ స్టోరీ లైన్ గురించి అడుగగా ఆయన స్టోరీ లైన్ చెప్పలేం కానీ, బాలయ్యతో నా గత చిత్రాలైన సింహ, లెంజెండ్ కి మించి ఈ చిత్రం ఉంటుంది అని ఫ్యాన్స్ కి భరోసా కల్పించారు. ఇక చాలా రోజులుగా ఈ మూవీలో బాలయ్య అఘోరాగా కనిపిస్తాడని వార్తలు వస్తుండగా, అది నిజమే అని బోయపాటి స్పష్టత ఇచ్చారు. బాలయ్య ఒక రోల్ నందు కొంత సమయం పాటు అఘోరాగా కనిపిస్తారట.

ప్రేక్షకులు ఫ్యాన్స్ కన్విన్స్ అయ్యేలా ఓ అద్భుతమైన నేపథ్యంతో కూడిన బ్యాక్ డ్రాప్ ఆ పాత్రకు ఉంటుంది అన్నారు. అలాగే ఆ అఘోరాగా బాలయ్య అలరించడం ఖాయం అని బోయపాటి విశ్వాసం వ్యక్తం చేశారు. మిర్యాల రవీంద్రా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూలు పూర్తి చేసుకోగా కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారని సమాచారం.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read