‘బ్రహ్మముడి’ ఇప్పుడు ‘స్టార్ మా’లో ప్రేక్షకులు ఎక్కువగా వీక్షిస్తున్న సీరియల్ అని చెప్పొచ్చు. ‘కార్తీక దీపం’ తర్వాత ఆ రేంజ్లో టి.ఆర్.పి రేటింగ్ ను రాబడుతున్న సీరియల్ ఇదే. ఇందులో రాజ్(మానస్) కి తల్లిగా నటిస్తున్న శ్రీప్రియ అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘వైదేహి పరిణయం’ వంటి క్రేజీ సీరియల్ లో కూడా ఈమె నటించి మంచి పేరు సంపాదించుకుంది. అయితే ‘బ్రహ్మముడి’ సీరియల్లో కోడలిని నానా మాటలు అంటూ ఏడిపించే అత్తగా ఈమె ఎక్కువ పాపులర్ అయ్యింది అని చెప్పాలి.
శ్రీప్రియని చూస్తే గడుసు అత్తలా అస్సలు కనిపించదు. కానీ ఈ పాత్రకు న్యాయం చేస్తుంది. అదే ఆమె స్పెషాలిటీ. అయితే ఈమె కూతురు కూడా ఓ హీరోయిన్ అనే సంగతి మీకు తెలుసా? బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు లెండి. కానీ నిజం.. శ్రీప్రియ కూతురు ఓ హీరోయిన్. ఆమె పేరు చరిష్మా శ్రీకర్. ఇప్పటిదాకా ‘నీతోనే హాయ్ హాయ్’.. ‘ఆర్ యూ మ్యారీడ్’ వంటి చిన్న సినిమాల్లో (Charishma) హీరోయిన్ గా నటించింది.
ఇటీవల వచ్చిన జగపతి బాబు ‘రుద్రంగి’ అనే సినిమాలో కూడా కీలక పాత్ర పోషించింది. కానీ ఇంకా ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేదు. తల్లి బుల్లితెర పై స్టార్ అయినప్పటికీ సినిమాల్లో రాణించాలి అనే ఉద్దేశంతో చరిష్మా శ్రీకర్ కష్టపడి పని చేస్తున్నట్టు తెలిపింది. ఈమె కూడా చూడటానికి అచ్చం తన తల్లిలానే ఉంటుంది. కావాలంటే ఆమె ఫోటోలు చరిష్మా ఫోటోలు చూడండి
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు