Brahmanandam: ఇండియన్ 2 లో ఆ కమెడియన్ స్థానంలో బ్రహ్మానందం?

  • July 4, 2023 / 12:23 PM IST

ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇన్ని రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కొన్ని కారణాలవల్ల వాయిదా పడింది అయితే తిరిగి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడంతో శంకర్ ఈ సినిమా షూటింగ్ పనులతో పాటు మరోవైపు రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ పనులలో కూడా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కి జోడిగా సీనియర్ నటి కాజల్ అగర్వాల్ అలాగే రకుల్ ప్రీతిసింగ్ నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హాస్యబ్రహ్మం బ్రహ్మానందం కూడా కీలకపాత్రలో నటించబోతున్నారని ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా బ్రహ్మానందం భారతీయుడు 2 సినిమాలో భాగం కానున్నరనే విషయం తెలియడంతో బ్రహ్మానందం అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాలను పూర్తిస్థాయిలో తగ్గించారు కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే ఈయన నటిస్తున్నారు.

ఇక తాజాగా రంగ మార్తాండ సినిమా ద్వారా తనలో దాగి ఉన్నటువంటి మరో నటన నైపుణ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉన్నటువంటి ఈయన ఇండియన్ 2 సినిమాలో నటించబోతున్నారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో కమల్ హాసన్ బ్రహ్మానందం (Brahmanandam) మధ్య వచ్చే సన్నివేశాలు ఎలా ఉండబోతాయోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే డైరెక్టర్ శంకర్ కి ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుతో ఏమాత్రం పడటం లేదు కనుక ఆయన స్థానంలో బ్రహ్మానందాన్ని తీసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలి అంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus