Avantika: హాలీవుడ్ లో సత్తా చాటుతున్న అవంతిక!

  • January 16, 2024 / 12:24 PM IST

సాధారణంగా ఇండస్ట్రీలో ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ఇలా చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి అనంతరం హీరో హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో అవంతిక వందనపు ఒకరు. ఈమె తెలుగమ్మాయి ఈమె తెలుగు చిత్ర పరిశ్రమలో బ్రహ్మోత్సవం అజ్ఞాతవాసి వంటి పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాకుండా అంబికా అగర్బత్తి యాడ్స్ కూడా చేశారు.

ఇలా పలు యాడ్స్ చేస్తూ తెలుగు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినటువంటి అవంతిక ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ అక్కడ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా హాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయి ఇంత మంచి సక్సెస్ అందుకోవడంతో అవంతిక పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. అవంతిక ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో మీన్ గర్ల్స్ చిత్రంలో కరేన్ శెట్టి అనే పాత్రలో నటించి మెప్పించింది. ఈ చిత్రంతో తన నటనకు ప్రశంసలు అందుకుంది.

ఇప్పుడు ఈ సినిమాకు హాలీవుడ్ లో ఎంతో మంచి ఆదరణ లభిస్తున్నటువంటి తరుణంలో ఈమె పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఇక ఈమె 2005వ సంవత్సరంలో కాలిఫోర్నియాలోనే జన్మించారు. ఇలా అవంతిక కాలిఫోర్నియాలో జన్మించడంతో అక్కడే తన విద్యాభ్యాసం కొనసాగిస్తూనే మరోవైపు నటనలో శిక్షణ కూడా తీసుకున్నారు. ఇలా నటనలో శిక్షణ తీసుకున్నటువంటి ఈమె టాలీవుడ్ సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రస్తుతం హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus