BRO: పవన్ – సాయి ధరమ్ తేజ్ మూవీ టైటిల్ ఫిక్స్..!

  • May 9, 2023 / 07:15 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , సాయిధ‌ర‌మ్ తేజ్‌కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. త‌మిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సీత‌మ్‌’ కి ఇది రీమేక్‌ కావడం విశేషం. ఈ చిత్రానికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అయినా ఇంకా టైటిల్ ఇంకా ఫిక్స్ చేయలేదు. ‘దేవుడే దిగి వ‌చ్చినా’, ‘దేవ‌ర‌’… వంటి టైటిల్స్ ను పరిశీలించారు. దాదాపు అవి ఫిక్స్ అని అంతా అనుకున్నారు.

టీం కూడా ఆ రెండు టైటిల్స్ లో ఒక టైటిల్ ను రిజిస్టర్ చేయించుకోవాలని భావించారు. కానీ ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు ఆ టైటిల్ లేదనే అభిప్రాయంతో వెనక్కి తగ్గారని సమాచారం. అంతేకాదు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఫైనల్ చేశారట. అందుతున్న సమాచారం ప్రకారం.. పవన్ – సాయి ధరమ్ తేజ్ ల కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఈ వారంలోనే టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేస్తారని తెలుస్తుంది.

ఈ చిత్రంలో ప‌వ‌న్ కళ్యాణ్.. టైంకి రూపమంటూ ఉంటే ఎలా ఉంటుంది? అనే విధంగా కనిపిస్తాడట. అయితే సాయి ధరమ్ తేజ్ యంగ్ హీరో కాబట్టి … పవన్ పాత్రని (BRO)  ‘బ్రో.. బ్రో..’ అని పిలుస్తాడట. అందుకే ఆ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు స్పష్టమవుతుంది. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నాడు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus