పవన్ సాయితేజ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కుతుండగా జులై నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ కు తక్కువ సమయం ఉండటంతో ప్రమోషన్లలో వేగం పెంచాలని ఫ్యాన్స్ సైతం కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమాకు కొన్నిరోజుల క్రితం దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్ వినిపించింది. ఈ టైటిల్ బాగుందని ఈ టైటిల్ నే ఫిక్స్ చేయాలని ఫ్యాన్స్ సైతం భావించారు.
అయితే ప్రేక్షకుల అంచనాలకు భిన్నంగా ఈ సినిమాకు (Bro) బ్రో అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు టైటిల్ ను రిజిష్టర్ చేయించడంతో ఈ టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. బ్రో అనే టైటిల్ క్యాచీగానే ఉన్నప్పటికీ పవన్ సాయితేజ్ సినిమా అంటే ఫ్యాన్స్ కొంచెం పవర్ ఫుల్ టైటిల్ ను ఆశిస్తారనే సంగతి తెలిసిందే. బ్రో అనే టైటిల్ వల్ల సినిమాపై అంచనాలు తగ్గుతాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
ఫ్యాన్స్ నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా టైటిల్ విషయంలో ఏ విధంగా ముందుకెళతారో చూడాలి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా 45 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం తీసుకున్నారు. రోజుకు 2 కోట్ల రూపాయల చొప్పున పవన్ కళ్యాణ్ కు రెమ్యునరేషన్ దక్కిందని సమాచారం అందుతోంది. విరూపాక్ష సక్సెస్ తర్వాత సాయితేజ్ నటించిన సినిమా ఇదే కావడం గమనార్హం.
సీరియళ్లు తీసిన అనుభవం ఉన్న సముద్రఖని శరవేగంగా ఈ సినిమా షూట్ ను పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి మేకర్స్ రాజీ పడటం లేదు. పవన్, సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ తో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. వినోదాయ సిత్తం రీమేక్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?