రకుల్ ప్రీత్ సింగ్ కాల్షీట్లు క్లాష్?

  • June 24, 2020 / 07:54 PM IST

మార్చి 25 నుండీ దేశ వ్యాప్తంగా.. ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ముంబైలోనే ఇరుక్కుపోయింది రకుల్. చెప్పాలంటే.. 3 నెలల పాటు ముంబై లో ఉన్న తన ఫ్లాట్ లోనే ఉంటూ వచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఈ మధ్యనే విమానాలు తిరుగుతున్న తరుణంలో గుర్గావ్ లోని తన ఇంటికి చేరుకుంది రకుల్. అందుకు సంబంధించిన రకుల్ ఫోటోలు కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత 9 సంవత్సరాల నుండీ ఎప్పుడూ ఇంటికి ఇంతలా దూరమవ్వలేదట రకుల్..!

ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ ఈ లాక్ డౌన్ టైములో తన అనుభవాన్నితెలియజేసింది. రకుల్ మాట్లాడుతూ.. “హమ్మయ్య ఇంటికొచ్చేశాను. ఇప్పుడు నేను చిన్న పిల్లని అయిపోయాను. ఇక్కడంతా నా ఇష్టమొచ్చినట్టు ఉంటాను.ఇక్కడ అలారం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంటి కెప్పుడొచ్చినా.. అమ్మ నాకు నచ్చిన వంట చేస్తుంటుంది. ఇప్పుడు ఎలాంటి ఎజెండా లేదు. హ్యాపీగా అమ్మతో టీవీ చూడడం, నాన్నతో వ్యాయామం చెయ్యడమే నా పని.ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్నాయి.

నేను కొన్ని సౌత్ ప్రాజెక్ట్ లు చెయ్యాల్సి ఉంది.బాలీవుడ్ లో కూడా ఓ సినిమాకి కమిటయ్యాను. ఆ హిందీ సినిమా మొదలవ్వకముందే సౌత్ సినిమాలు మొదలైతే బెటర్. లేకపోతే నా కాల్షీట్లు క్లాష్ అయ్యే సమస్య తలెత్తుతుంది” అంటూ చెప్పుకొచ్చింది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus