ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ను.. డ్యామేజ్ చేసెయ్యారు కదా..!

  • September 12, 2020 / 11:37 AM IST

ఓ పక్క అడవులను దత్తత తీసుకుంటూ, అలాగే జిమ్ ట్రైనర్ కు కార్ గిఫ్ట్ వంటివి ఇస్తూ.. ఇలా ఎన్నో మంచి పనులు చేస్తున్న ప్రభాస్ ను ఇప్పుడు డ్రగ్స్ కేసులు టెన్షన్ పెడుతున్నాయట. ఇప్పుడు బాలీవుడ్ మరియు శాండల్ వుడ్ లో డ్రగ్స్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. అయితే వాటికి ప్రభాస్ కు సంబంధం ఏంటి అనేగా మీ డౌట్..! అక్కడికే వస్తున్నా.. ప్రముఖ హీరోయిన్ సంజన గల్రాని ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. గతంలో ఈమె ప్రభాస్ నటించిన ‘బుజ్జిగాడు’ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది. దాంతో చాలా వరకూ ‘ప్రభాస్ హీరోయిన్ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అంతేకాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇటీవల ‘ముంబై నగరం పాక్ ఆక్రమిత కశ్మీర్‌ ను తలపిస్తోందంటూ’ వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో శివసేన నేతలు ముంబై రావద్దంటూ ఆమెకు హెచ్చరిక జారీ చేసారు. ఇప్పుడు ఈమెకు సంబంధించిన వార్తల్లో కూడా ‘ప్రభాస్ హీరోయిన్ వార్నింగ్’ అంటూ సంభోదిస్తున్నారు.అంతేకాదు ఈమె కూడా డ్రగ్స్ కేసుల విషయంలో రచ్చ రచ్చ చేస్తుంది.

ఇలాంటి కాంట్రవర్సీ విషయాలకు సంబంధించిన వార్తల్లో ప్రభాస్ పేరుని ఉపయోగించడం పట్ల.. అతను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. పాన్ ఇండియా స్టార్ గా ఎదుగుతునం తరుణంలో ప్రభాస్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే విధంగా ఈ వార్తలు ఉన్నాయనే డిస్కషన్లు కూడా ప్రస్తుతం మొదలయ్యాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus