బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!

బిగ్‌బాస్‌ ఇంట్లోకి రావడానికి అర్హతలేంటి అంటే… ఫలానా అంటూ ఏమీ లేవు అని చెప్పొచ్చు. బిగ్‌బాస్‌ టీం వాళ్లకు తగ్గట్టుగా ఎంపిక చేసుకొని తీసుకుంటారు. అయితే బిగ్‌బాస్‌ ఇంట్లోకి వచ్చాక 100 రోజులూ ఉండాలంటే కచ్చితంగా కొన్ని అర్హతలు ఉంది తీరాలి. ముఖ్యంగా ప్రేక్షకుల అభిమానం సంపాదించాలి. స్ట్రాటజీ ఉండాలి… దాంతోపాటు ‘ఇదే నా నిజమైన నేను’ అని ప్రేక్షకులకు చూపించాలి. ప్రస్తుతం బిగ్‌బాస్‌ హౌస్‌లో అలా తనను తాను ఆవిష్కరించుకుంటున్న హౌస్‌ మేట్‌ అభిజీత్‌. నామినేషన్‌లో ఉన్నాననే ఎలాంటి భయం లేకుండా… కూల్‌గా సాగిపోతున్నాడు.

అభిజిత్‌ ఎప్పుడు నవ్వుతుంటాడో… ఎప్పుడు కోప్పడతాడో తెలియదు అంటూ దివి చెప్పిన విషయం గుర్తుందిగా. దానికి అభిజిత్‌ రెస్పాన్స్‌ కూడా చూసే ఉంటారు. తన గురించి, తన కోపం గురించి మాట్లాడితే ఎవరైనా ఏం చేస్తారు… ‘నన్నెందుకు అంటున్నావ్‌… అయినా నాకు కోపం ఎక్కువ అనేది నీ అభిప్రాయం’ అంటూ రిటర్న్‌ అవుతారు. ‘చాలా కూల్‌గా ఓకే’ అన్నాడు. అక్కడే అభిజిత్‌ మెచ్యూరిటీ కనిపిస్తుంది.

సోహైల్‌ – ఆరియానా నైబర్‌ హౌస్‌ నుండి బిగ్‌ బాస్‌ హౌస్‌లోకి వచ్చిన రోజు కూడా అభిజిత్‌ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు. అఖిల్‌, నోయల్‌తో ఆ ఇద్దరూ మాటల జోరు పెంచినప్పుడు చాలా సేపు కామ్‌గా ఉన్నాడు. ఇక 14 మంది మీద ఆ ఇద్దరూ డామినేషన్‌ చేస్తున్నప్పుడు అభిజిత్‌ ఎంటర్‌ అయ్యాడు. అయితే అభిజిత్‌ను ఇరిటేట్‌ చేయడానికి సోహైల్‌ ఎంత ట్రై చేసినా కూల్‌గానే ఉన్నాడు. ఇక వాళ్లు ఎక్కువ చేస్తున్నారని అర్థమైనప్పుడు ఓపెన్‌ అయ్యాడు. ఇది అతని ఓర్పును తెలియజేస్తుంది.

చిన్న చిన్న విషయాలకు హర్ట్‌ అయ్యే కళ్యాణి విషయంలో కూడా అభిజీత్‌ జాగ్రత్తగానే ఉన్నాడు. ఏదో సరదాకి ‘మీరు చీర కడితే చూడలేం బాబోయ్‌’ అని అంటే.. దానికి కళ్యాణి ఎంత రచ్చ చేసిందో మీకు తెలుసు. ‘నేనేదో సరదాకి అన్నానండి’ అంటూ అభిజీత్‌‌ ఎంత చెప్పినా కళ్యాణి వినకుండా లేచి వెళ్లిపోయింది. అయినా అభిజిత్‌ వదిలేయకుండా… ఆమె దగ్గరకు వెళ్లి మరీ సారీ చెప్పి వచ్చాడు. అది అతను పార్టిసిపెంట్స్‌ మీద చూపించే గౌరవం తెలియజేస్తుంది.

నిన్న ఓపెన్‌ హార్ట్‌ విత్‌ గంగవ్వలోనూ అభిజిత్‌కు మంచి మార్కులే పడ్డాయి. తనకు అప్పగించిన పనిని చక్కగా చేసుకుంటాడు. వంట గదిలో పాత్రలు తోముతాడు, అందరికీ చేదోడువాదోడుగా ఉంటాడని గంగవ్వ మెచ్చుకున్న విషయమూ చూసే ఉంటారు. అలా అని అభిజిత్‌ ఎప్పుడూ ఒకే పనిలో ఉండిపోతాడా అంటే… ఎపిసోడ్‌లో కెమెరా ఎటు తిప్పినా కనిపిస్తాడు… అంటే అందరితో కలసిపోతాడు, అందరిలో ఒకడిలా ఉంటాడు అనుకున్నట్లే కదా.

‘మీలో ఎవరు కట్టప్ప’ అనే విషయంలో బిగ్‌బాస్‌ ఓటింగ్‌ ఏర్పాటు చేశాడు. అయితే అభిజిత్‌ పేరు ఏ ఒక్కరూ రాయకపోవడం చూస్తే… హౌస్ మేట్స్ కి అభిజీత్ మీద ఉన్న నమ్మకం తెలిసిపోతుంది. ఈ ఒక్క విహాయం చాలు అభిజీత్ మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పటానికి.

ఇదే కాదు… హౌస్‌లో తన గురించి మాట్లాడినా, రౌండప్‌ చేయాలని చూసినా.. అభిజిత్‌ కూల్‌గానే ఉంటున్నాడు. మనం ఆట ఆడటానికి వచ్చాం… ఈ క్రమంలో ఒకరి మనోభావాలు దెబ్బ తియక్కర్లేదు. వాళ్ల ఆలోచనలు తెలుసుకొని, మనల్ని మన ఆటను ఆడుకోవాలి అంటుంటాడు. ఈ తీరుతోనే ఈ వారం ఎలిమినేషన్‌ నుండి అభిజిత్‌ బయటపడతాడని నెటిజన్లు కూడా అనుకుంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus