యంగ్ హీరో విశ్వంత్ పై కేసు నమోదు.. కారణం అదే..!

  • January 20, 2021 / 12:32 PM IST

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ‘కేరింత’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విశ్వంత్. ఆ చిత్రంలో బడా నిర్మాత యం.యస్.రాజు కొడుకు సుమంత్ మెయిన్ హీరోగా నటించగా విశ్వంత్ సెకండ్ హీరోగా నటించాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు హీరో విశ్వంత్ పై కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే..ఈ యంగ్ హీరో తక్కువ ధరలకే కార్లు ఇప్పిస్తాను అని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నాడట.

కానీ కార్లు మాత్రం ఇప్పించలేదని బాధితులు చెబుతున్నారు.సరే డబ్బులైనా తిరిగిచ్చేయమని వారు కోరగా అతను ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటున్నాడని వీరు చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో బాధితులు.. బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు పోలీసులు విశ్వంత్ పై ఛీటింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే దర్యాప్తు కూడా చేపట్టారని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి..హీరో విశ్వంత్ ను వెంటనే జడ్జి చెయ్యడం కరెక్ట్ కాదని అతని సన్నిహితులు చెప్పుకొస్తున్నారు.

ఇక విశ్వంత్ విషయానికి వస్తే.. ఇతని పూర్తి పేరు విశ్వనాథ్.తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాకినాడలోని సామర్లకోటలో ఇతను జన్మించాడు. ‘కేరింత’ చిత్రం తరువాత ‘మనమంతా’ ‘జెర్సీ’ ‘ఓ పిట్ట కథ’ వంటి చిత్రాల్లో కూడా ఇతను నటించాడు. ముఖ్యంగా ‘జెర్సీ’ సినిమాలో ఇతని నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus