Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

ప్రముఖ తమిళ కథానాయకుడు సూర్య హీరోగా, యంగ్‌ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా వెంకీ అట్లూరి తెరకెక్కంచిన చిత్రం ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’. ఈ నెల 14న విడుదల కానున్న ఈ సినిమా సెన్సార్‌ సర్టిఫికెట్‌ బయటకు వచ్చింది. అందలో సినిమాలో సెన్సార్‌ చేసిన సూచనల మేరకు మ్యూట్‌ చేసిన సీన్స్‌ వివరాలు నమోదు చేశారు. దాంతోపాటు సినిమా బ్యానర్‌ పేరు కూడా కొత్తది కనిపించింది. మనకు నాగవంశీ సినిమా అంటే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ అని మాత్రమే తెలుసు. కానీ సెన్సార్‌కి అప్లై చేసింది వేరే బ్యానర్‌ పేరుతో.

Vishwanath And Sons

అవును.. తొలుత సినిమా సెన్సార్‌ సన్నివేశాల సంగతి చూస్తే.. మొత్తంగా సినిమాలో నాలుగు సన్నివేశాల్లో మార్పులు సూచించారు సెన్సార్‌ బోర్డు సభ్యులు. ఒక సన్నివేశంలో సెల్ఫ్‌ అనే పదాన్ని మ్యూట్‌ చేయించారు. మరో సీన్‌లో మిడిల్‌ ఫింగర్‌ చూపించే సీన్‌ని కూడా తొలగించారు. మరో సీన్‌లో హీరోయిన్‌ వెనుక ఉన్న ఫొటోలను మార్పించారు. మరో చోట జెండాను మార్పించారు. అయితే తెలుగు వెర్షన్‌కి సంబంధించి అదనపు మార్పులు ఏవీ సూచించలేదు.

ఇక బ్యానర్‌ సంగతి చూస్తే.. సూర్యదేవర నాగవంశీ అంటే సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ కానీ.. ఆ బ్యానర్‌తో శ్రీకర స్టూడియోస్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్‌లు కలిపి సినిమాలు తీస్తుంటాయి. కానీ నాగవంశీనే ముందుంటారు. కానీ ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ సినిమా సెన్సార్‌కి అప్లై చేసినప్పుడు బ్యానర్‌ పేరుగా స్ప్రింట్‌ స్క్రీన్స్‌ ఎల్‌ఎల్‌పీ అనే బ్యానర్‌ తరఫున అప్లై చేశారు. ఇందులో ఓ ఓటీటీ పార్టర్నర్‌ అని తెలుస్తోంది. మరి ఈ బిజినెస్‌ లెక్కలు ఏంటో నాగవంశీనే చెప్పాలి.

ఫ్యామిలీ ఆడియన్స్‌ అని చెబుతున్న ఈ సినిమాకు UA సెన్సార్‌ సర్టిఫికెట్‌ దక్కింది. మ్యూట్‌ చేసిన కొన్ని సీన్స్‌ సినిమాలోని మరో కోణాన్ని చెబుతున్నాయి. చూద్దాం వెంకీ అట్లూరి ఏం చేశారో?

బ్రేక్ ఈవెన్ సాధించిన ‘కొరియన్ కనకరాజు’

https://www.youtube.com/watch?v=E1ZT4StDFZM

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus