ఓ సినిమా విజయం సాధించడంలో కంటెంట్ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో, ఆ కంటెంట్ కి తగ్గ క్యాస్టింగ్ ను ఎంచుకోవడం కూడా అంతే ముఖ్యం. కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ హీరో నటించినా, పాత్రలకి నిండుతనం రాకపోవచ్చు, వారి ఇమేజ్‌కు పాత్రలు సెట్ కాకపోవచ్చు. ఒకవేళ ఇలానే జరిగితే.. ప్రేక్షకులు ఆ సినిమాకు తగ్గ గౌరవం ఇవ్వకపోవచ్చు. వెంకటేష్ నటించిన ‘వాసు’, జగపతి బాబు నటించిన ‘ఆహా’ చిత్రాల విషయంలో కూడా సరిగ్గా ఇదే జరిగింది. అది ఎలా అంటారా? అయితే ఈ స్టోరీ మీరు తెలుసుకోవాల్సిందే.
వాస్తవానికి ‘ఆహా’ ‘వాసు’ సినిమాల కథలు మొదట పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వద్దకు వెళ్లాయట. ‘గోకులంలో సీత’ తర్వాత పవన్ కళ్యాణ్ ‘ఆహా’ చేయాలి. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పవన్ కళ్యాణ్ చేయలేకపోయాడు. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన సినిమా అది. 1998 లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద జస్ట్ యావరేజ్ ఫలితాన్ని మాత్రమే అందుకుంది. కానీ వందేమాతరం శ్రీనివాస్ సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చాలా బాగుంటాయి. జగపతి బాబు ఏజ్ కి ఇంట్లో చిన్నకొడుకు పాత్ర అంటే ఆడియన్స్ ఓన్ చేసుకోలేదు. పవన్ కళ్యాణ్ అయితే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది.
ఇక ‘వాసు’ కూడా అల్మోస్ట్ అంతే. కరుణాకరన్ దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ కథ కూడా మొదట పవన్ కళ్యాణ్ వద్దకే వెళ్లింది. పవన్ తో ‘తొలిప్రేమ’ తెరకెక్కించిన కరుణాకరన్.. ఈ కథని మొదట పవన్ వద్దకి తీసుకెళ్లారు. కానీ పవన్ చేయలేదు. 2002 లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా బాగానే ఉంటుంది. హారిస్ జయరాజ్ సంగీతంలో రూపొందిన పాటలన్నీ చార్ట్ బస్టర్సే.! కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. వెంకటేష్ యూత్ అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు. అందుకే ఫలితం తారుమారు అయిపోయింది. ఈ సినిమా పవన్ చేసి ఉంటే కచ్చితంగా ఫలితం మరోలా ఉండేది అనడంలో సందేహం లేదు.