సీనియర్ నటుడు చలపతిరావుకి తప్పు తెలిసి వచ్చింది. పొరబాటుగా వచ్చిన మాటలను వెనక్కి తీసుకున్నారు. ఆదివారం జరిగిన “రారండోయ్ వేడుక చూద్దాం” ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన “అమ్మాయిలు మనః శాంతికి హానికరం.. కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు” అని చెప్పిన మాటలు దుమారం లేపాయి. అటు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పలువురు చలపతిరావుపై విరుచుకుపడ్డారు. మహిళలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం పై మీడియా ముఖంగా చలపతి రావు స్పందించారు. “నారీ లోకానికి నమస్కారం. నేను మాటాడిన మాటల్లో డబల్ మీనింగ్ తీసుకోవద్దు. ప్రతి మగాడి వెనుక మహిళ అండ ఉంది.
నాకూ మా ఆవిడ సపోర్ట్ ఉన్నింది. అటువంటి ఆడవాళ్లు నా మాట తో బాధపడి ఉంటే.. వారందరికీ క్షమాపణలు చెబుతున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ మహిళలను గౌరవిస్తూనే ఉంటాను. జై మహిళ లోకం” అని ఓ వీడియో రూపంలో సారీ చెప్పారు. ఆడియో వేడుకలో చలపతి రావు మాట్లాడినప్పుడు వేదికపై ఉన్న యాంకర్ రవి .. సూపర్ అన్నందుకు కూడా అతనిపై విమర్శలు వచ్చాయి. అందుకోసం రవి కూడా తన మాటపై అందరికీ సంజాయిషీ ఇచ్చుకున్నారు. చలపతి రావు మాట్లాడింది సరిగా వినిపించుకోకుండా.. తాను సూపర్ అన్నానని సమర్ధించుకున్నారు. దీంతో ఈ వివాదం సద్దుమనిగింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.