Chandra Mohan: చంద్రమోహన్ ఫ్యామిలీ గురించి ఎవ్వరికీ తెలియని విషయాలు..!

  • July 16, 2022 / 08:05 PM IST

చంద్రమోహన్ … ఒకప్పుడు టాప్ హీరోగా ఓ వెలుగు వెలిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన తర్వాత హీరోగా, కమెడియన్‌గా, విలన్‌గానూ ప్రేక్షకులను మెప్పించారు. దాదాపు 900 కు పైగా చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. ఇందులో 175 సినిమాల్లో ఆయన హీరోగా నటించడం విశేషంగా చెప్పుకోవాలి. ఆయన పక్కన హీరోయిన్ గా చేస్తే వాళ్లు స్టార్లు కావడం పక్కా అనే సెంటిమెంట్ కూడా ఒకప్పుడు ఇండస్ట్రీలో ఉండేది. అందుకు తగ్గట్టుగానే జయప్రద, జయసుధ, శ్రీదేవి ఇంకా కొంతమంది హీరోయిన్లు స్టార్లుగా ఎదిగిన సందర్భాలు ఉన్నాయి.

అయితే చంద్రమోహన్ తన ఇన్ఫ్లుయెన్స్ తో తమ పిల్లలను కూడా స్టార్లను చేస్తారు అని అంతా అనుకున్నారు. కానీ చంద్రమోహన్ తన ఫ్యామిలీని సినిమాలకు దూరంగా ఉంచారు.’నా ఇద్దరు కుమార్తెలు.. బాగుంటారని, ఒకానొక సమయంలో భానుమతి గారు చెప్పుకొచ్చారు. పిల్లలిద్దరినీ చైల్డ్ ఆర్టిస్టులుగా చేద్దామని కూడా అడిగారు, కానీ నేను వద్దన్నాను. నటుడిగా బిజీగా ఉన్న రోజుల్లో నాకు పిల్లలతో గడిపే సమయం ఉండేది కాదు. అంతేకాదు పిల్లలు ఎప్పుడైనా లోకేషన్ కు వచ్చినా వాళ్లు నన్ను గుర్తు పట్టే వాళ్లు కాదు.

నాలా వాళ్ళు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం, కష్టపెట్టడం వంటివి వద్దనే ఉద్దేశంతో వాళ్ళను పెంచాను. అందుకు తగ్గట్లుగానే ఇద్దరు కుమార్తెలు కూడా బాగా చదివి గోల్డ్ మెడల్స్ అందుకుని, మంచి ఉద్యోగాలు సాధించారు” అంటూ ఆయన చెప్పుకొచ్చారు. అయితే చంద్రమోహన్ సొంత తమ్ముడు కూతురు మాత్రం కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘సప్తపది’ మూవీలో నటించింది.ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక చంద్రమోహన్ తమ్ముడి కూతురు పేరు సబిత. ఈ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు క్యూ కట్టాయి.

కానీ వాటిని సబితా సున్నితంగా తిరస్కరించింది. ఆ తర్వాత వివాహం చేసుకుంది అని తెలుస్తుంది. ఈమె ప్రస్తుతం సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంది. క్లాసికల్ డ్యాన్సర్ అయిన సబిత, ఒక ఈవెంట్ లో డాన్స్ చేస్తుండగా ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా విచ్చేసిన కె.విశ్వనాథ్ గారు తన సినిమాలో నటించమని అడిగారట. ఆయన దర్శకుడు కాబట్టి.. పాత్ర కూడా మంచిది కాబట్టి చంద్రమోహన్ చేయమని చెప్పినట్లు తెలుస్తుంది.

ది వారియర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus