ముందుకా..? వెనక్కా? కన్ఫ్యూజన్లో బ్యాచిలర్ టీం..!

  • February 9, 2021 / 05:52 PM IST

సరైన హిట్టు కొట్టడం కోసం అఖిల్ చేస్తున్న నాలుగో ప్రయత్నం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ‘జి.ఏ2 పిక్చర్స్’ బ్యానర్ పై బన్నీ వాస్ నిర్మించబోతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీత దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ‘మనసా మనసా’ పాటకు సూపర్ రెస్పాన్స్ లభించింది. దాంతో సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఇక ఈ చిత్రాన్ని మే 28న విడుద‌ల చెయ్యబోతున్నట్టు ఈ మధ్యనే దర్శకనిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

కానీ ఇప్పుడు మళ్ళీ విడుదల తేదీ మారే అవకాశం ఉందనేది తాజా సమాచారం. దానికి కారణాలు కూడా లేకపోలేదు. వివరాల్లోకి వెళితే.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రం షూటింగ్.. చాలా వరకూ పూర్తయిపోయిందట. బ్యాలన్స్ ఒక్క రోజు షూటింగ్ తో సహా … పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వర్క్ కొంత బ్యాలన్స్ ఉందట. మార్చి లోపే .. ఫ‌స్ట్ కాపీ రెడీ అయిపోతుందని తెలుస్తుంది. దీంతో మే వరకూ ఆగితే చిరు ‘ఆచార్య’, వెంకీ ‘నారప్ప’, బాల‌య్య-బోయపాటి ల సినిమాల ప్రభావం బ్యాచిలర్ పై పడే అవకాశం ఉంది.

దీంతో మార్చిలోనే విడుదల చేస్తే పెద్ద సినిమాల పోటీ నుండీ తప్పించుకోవచ్చు. లేదు అంటే జూన్ వరకూ వెళ్లాల్సిందే. ఈ విషయం పై బొమ్మరిల్లు భాస్కర్ మరియు బన్నీ వాస్ లు అల్లు అరవింద్ తో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి అరవింద్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి..!

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus