కస్తూరి, చిన్మయి అనగానే అందరికీ వివాదాలే గుర్తొస్తాయి. వాళ్లకి వివాదాలు కొత్త కాదు. ముఖ్యంగా కస్తూరికి ..! ‘ఇంటింటి గృహాలక్ష్మీ’ అనే సీరియల్ లో చాలా పద్దతిగా, అణకువగా, సహనం కలిగిన తల్లిగా కనిపించినా.. ఆమె నిజ జీవితానికి ఆ పాత్రకి అస్సలు సంబంధం లేదు. నిజజీవితంలో ఆమె చాలా బోల్డ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.బోల్డ్ డ్రెస్సులు వేసుకుంటూ.. సినిమాల్లో ఐటెం సాంగ్స్ వంటివి చేస్తూ, ఫెమినిస్ట్ అంటూ అందరినీ కెలుకుతూ ఆమె చేసే హడావిడి మామూలుగా ఉండదు.
తమిళ జనాలకి కస్తూరికి చెందిన వివాదాల వార్తలు వినడం కొత్తేమీ కాదు. కానీ తెలుగులో ఆమె బుల్లితెర పై ఫేమస్ అయ్యింది కాబట్టి.. మన వాళ్లకి కొంచెం కొత్త. విషయమేంటంటే.. ఇటీవల కస్తూరి తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాప్ వద్ద మద్యం కొనుగోలు చేస్తూ కనిపించారు. అందుకు కస్తూరి ‘అమ్మాయిలు బాగా తాగండి .. ఏమవుతుంది మహా అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతారు.
మన హక్కులు మనకి తిరిగి వస్తాయి’ అంటూ కామెంట్స్ చేసింది. దీంతో కస్తూరి పై ట్రోలింగ్ జరుగుతుంది. తాజాగా కస్తూరి పోస్ట్ పై చిన్మయి స్పందించింది. ‘కస్తూరి.. నువ్వు ఈ వీడియో షేర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. నిజంగా చెప్తున్నా ఇది చాలా తప్పు’ అంటూ కామెంట్స్ చేసింది. నిజానికి చిన్మయి కూడా ఫెమినిజానికి సపోర్ట్ చేసే మహిళ. (Chinmayi) ఆమె కూడా కస్తూరిని తప్పుబట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
தண்ணியடி, பெண்ணே தண்ணியடி !
எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண்
இளைப்பில்லை காணென்று தண்ணியடி.WhatsApp fwd of the day. As received.
Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் #dravidamodel pic.twitter.com/7SA889fwpp— Kasturi (@KasthuriShankar) July 13, 2023
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!
సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!