Chiranjeevi, Nagababu: టాలీవుడ్లో మెగాస్టార్ కే ఇష్టమైన స్టార్ హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!

  • August 28, 2021 / 01:08 PM IST

హెడ్డింగ్ చూడగానే ఎవ్వరికైనా సరే ఇదేం విచిత్రం అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి దాదాపు 30 ఏళ్ళ పై నుండే స్టార్ డం ను అనుభవిస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే సినిమాల్లోకి వచ్చాము అని చాలా మంది చెబుతుంటారు. ఇక నాగబాబుకి అన్నయ్యే సర్వస్వం అని అంతా అనుకుంటారు. కానీ చిరంజీవి,నాగ బాబులు సినీ పరిశ్రమకి రాకముందు ఓ స్టార్ హీరోని అమితంగా ఇష్టపడేవారట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ.

చిరంజీవికి మాత్రమే కాదు నాగబాబుకి కూడా కృష్ణ అంటే చాలా ఇష్టం. వీళ్ళ నాన్నగారు వెంకట్రావు గారు కూడా అంతే..! ఆయన కూడా నటులవ్వాలని ఎంతో తపన పడేవారు. కానీ కుటుంబ పరిస్థితుల రీత్యా కుదర్లేదు. ఆయనకి కృష్ణగారు అన్నా.. ఆయన సినిమాలు అన్నా చాలా ఇష్టపడేవారు. చిరంజీవి, నాగబాబు లు కూడా చదువుకునే రోజుల్లో కృష్ణ గారి సినిమాలకి నేల టిక్కెట్ కు వెళ్ళేవారట.ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్ దూసుకుపోతున్న రోజుల్లో కృష్ణగారు ఎంట్రీ ఇచ్చి ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో నటించి మెప్పించారు.

ఎటువంటి సంకోచం లేకుండా రిస్కీ ప్రాజెక్టుల్లో కూడా నటించి సక్సెస్ అందుకున్న ఘనత ఆయనది. చిరంజీవి గారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాక కృష్ణగారితో కలిసి నటించిన సంగతి తెలిసిందే..! ‘తోడు దొంగలు’ అనే చిత్రంలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇక నాగబాబు.. ‘శ్రావణమాసం’ అనే చిత్రంలో కృష్ణగారితో కలిసి నటించారు.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus