‘ఆచార్య’ విషయంలో చిరు, చరణ్ అంత చేశారా? ఇప్పటివరకు ఎవ్వరికీ తెలియని విషయం ఇది..!

  • October 14, 2022 / 07:20 AM IST

మెగాస్టార్ చిరంజీవి నటించిన మెగాస్టార్ చిరంజీవి నటించిన పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘గాడ్ ఫాదర్ మూవీ ఇటీవల విజయదశమి రోజున రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా గెస్ట్ రోల్ ప్లే చేసిన ఈ మూవీకి తొలి రోజు సూపర్ హిట్ టాక్ లభించింది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

‘కొణిదెల సురేఖ’ సమర్పణలో ‘కొణిదెల ప్రొడక్షన్స్’, ‘సూపర్ గుడ్ ఫిలింస్’ బ్యానర్ లపై ఆర్ బి చౌదరి, ఎన్ వి ప్రసాద్ లు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కలెక్షన్స్ సంగతి ఎలా ఉన్నా ఇప్పట్లో పెద్ద సినిమాలు కానీ క్రేజ్ ఉన్న సినిమాలు కానీ లేకపోవడం వల్ల ఈ చిత్రాన్ని జనాల్లోకి ఎక్కువగా తీసుకెళ్లేందుకు ప్రమోషన్లు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయనకు ‘ఆచార్య’ రిజల్ట్ పై ప్రశ్నలు ఎదురయ్యాయి.

‘ఆచార్య’ రిజల్ట్ ను మీరు ఎలా తీసుకున్నారు.? మీ సొంత బ్యానర్ కు కూడా ఈ చిత్రంలో భాగస్వామ్యం ఉంది కదా? అంటూ ఓ ప్రశ్న ఎదురైంది. ఇందుకు చిరు స్పందిస్తూ.. “మేము నటించిన సినిమా ఏదైనా ప్లాప్ అయితే దాని పూర్తి బాధ్యత మేమే తీసుకుంటాం. ‘ఆచార్య’ ప్లాప్ అయినందుకు మేము బాధపడలేదు. మా వంతు 80 శాతం పారితోషికం వెనక్కి ఇచ్చేశాం. నేను, చరణ్ తీసుకున్న పారితోషికాల్లో 80 శాతం వెనక్కి ఇవ్వడం జరిగింది” అంటూ చిరు చెప్పుకొచ్చారు.

‘ఆచార్య’ ప్లాప్ అయినప్పుడు పూర్తి బాధ్యత చిరు, చరణ్ లు తీసుకుంటే.. మరి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు .. కొరటాల అంతలా ఎందుకు ఇబ్బంది పెట్టారు? అతని స్థలం కూడా ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చింది? అనేవి అంతుచిక్కని ప్రశ్నలుగా నెటిజన్లు భావిస్తున్నారు. ఇప్పటివరకు దర్శకుడు కొరటాల.. ఎన్టీఆర్ తో చేయాల్సిన మూవీ కూడా మొదలుపెట్టలేదు అన్న సంగతి తెలిసిందే.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus