Chiranjeevi: మొదట షూట్ చేసిన గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ఇదే!

  • October 13, 2022 / 01:46 PM IST

ఫస్ట్ వీకెండ్ వరకు గాడ్ ఫాదర్ మూవీ కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధించగా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. వీక్ డేస్ లో ఈ సినిమా కలెక్షన్లు రోజుకు 2 కోట్ల రూపాయల లోపే ఉండటంతో ఈ సినిమా షేర్ కలెక్షన్లు భారీస్థాయిలో పెరగడం లేదు. గాడ్ ఫాదర్ సినిమాకు టార్గెట్ భారీగా ఉండగా ఆ టార్గెట్ ను ఈ సినిమా అందుకోవడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

దసరా పండుగకు మూడు సినిమాలు థియేటరల్లో విడుదల కాగా ఈ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. చిరంజీవి మాత్రం గాడ్ ఫాదర్ సినిమాకు ప్రమోషన్స్ చేస్తూ ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా చిరంజీవి మాట్లాడుతూ డైరెక్టర్ మోహన్ రాజా మార్పుల వల్లే గాడ్ ఫాదర్ ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడం సాధ్యమైందని అన్నారు.

గాడ్ ఫాదర్ ఫైనల్ కాపీ చూసిన తర్వాత కూడా చాలా మార్పులు చేశామని మొదట షూట్ చేసిన క్లైమాక్స్ లో నీ భర్త నా ఎదురుగా ఉన్నాడు ఏం చేయమంటావ్ అమ్మా అని అడగగా సత్యప్రియ(నయనతార) తాళి తెంపేస్తుందని నేను జయదేవ్(సత్యదేవ్) ను కాల్చి చంపేయడం లేదా జయదేవ్ కాల్చుకుని చనిపోయేలా ప్లాన్ చేశామని అయితే ఆ క్లైమాక్స్ నాకు నచ్చలేదని చిరంజీవి అన్నారు.

తన మామను చంపిన విధంగానే ఇన్ హేలర్ తో జయదేవ్ తనను తాను చంపుకోవడం అందరికీ బాగా నచ్చిందని సినిమా రిలీజ్ కు మూడు వారాల ముందు ఈ మార్పు చేశామని ఆయన తెలిపారు. నేను నటించిన సినిమాలలోని టాప్5 సినిమాలలో గాడ్ ఫాదర్ ఒకటిగా నిలుస్తుందని చిరంజీవి అన్నారు. గాడ్ ఫాదర్ మూవీ నిజంగా టాప్5 లో నిలిచి చిరంజీవి నమ్మకం నిజమవుతుందేమో చూడాల్సి ఉంది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus