Chiranjeevi: డబుల్‌ ట్రీట్‌కి సిద్ధంకండి అంటున్న చిరంజీవి!

  • July 29, 2021 / 12:19 PM IST

ఏడాదికి ఒక సినిమా, ఒకసారి సెట్‌పై ఒక సినిమా అనుకుంటూ (?) ఇప్పుడు స్టార్‌ హీరోలు సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు అయితే సెట్స్‌పై ఒకేసారి ఒకటికి మించి సినిమాలు సిద్ధమవుతుండేవి. అందుకే ఏడాది పదుల సంఖ్యలో సినిమాలు వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. అలా సినిమాలు చేసినవారిలో మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఉన్నారు. ఇటీవల కాలంలో చిరు కూడా వరుస సినిమాలు చేయలేదు. కానీ ఇప్పుడు చేస్తారట. ‘ఆచార్య’ పనులు పూర్తి చేసుకొని… చిరంజీవి తర్వాతి సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

ఆగస్టు 13 నుంచి ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు మొదలవుతాయని ఇటీవల నిర్మాత ప్రకటించారు. అయితే సెప్టెంబరు ఆఖరులో కానీ, అక్టోబరు ప్రారంభంలోని చిరంజీవి – బాబి సినిమా మొదలవుతుందని సమాచారం. అవును ‘లూసిఫర్‌’ రీమేక్‌ పనులు జరుగుతుండగానే, రెండో సినిమా స్టార్ట్‌ చేస్తారట చిరంజీవి.‘ఆచార్య’ సినిమాకు ప్రస్తుతం తుది హంగులు అద్దుతున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థియేటర్లు ఓపెన్ చేసుకోమని ప్రభుత్వాలు చెప్పినా…

ఇంకా ఆ వాతావరణం ఏమీ తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. 30న కొన్ని సినిమాలు విడుదలవుతున్నాయి. వాటికి వచ్చే స్పందన చూసి మన నిర్మాతలు ముందుకొస్తారేమో చూడాలి.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus