ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలలో కలిసి నటించారు లేదా కాస్త చనువుగా ఉన్నారు అంటే ఇక వారిద్దరి మధ్య డేటింగ్ లు, ప్రేమలు, సహజీవనాలు అంటూ రకరకాల వార్తలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా మంది సెలబ్రిటీలను ఒకవైపు పాపులర్ చేస్తూనే మరొకవైపు మరింత హాట్ టాపిక్ గా మారుస్తున్నారు. అంతేకాదు గతంలో జరిగిపోయిన విషయాలను కూడా మళ్లీ బయటకు తీస్తూ మరింత వైరల్ గా మారుస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే గతంలో చిరంజీవికి (Chiranjeevi) సంబంధించిన ఒక వార్త ఇప్పుడు మళ్లీ తల పైకి రావడం గమనార్హం. వాస్తవానికి చిరంజీవి చాలా చిన్న వయసులోనే అల్లు రామలింగయ్య కూతురు సురేఖను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక తొందరగా పెళ్లయింది కాబట్టి ఆయన జీవితంలో ఎలాంటి కాంట్రవర్సీలు లేవని అందరూ అనుకున్నారు కానీ ఆయన జీవితంలో కూడా ఇలాంటి ఎన్నో రూమర్స్ సృష్టించారన్నది ఇప్పుడే ఒక్కొక్కటిగా బయటపడుతోంది. ముఖ్యంగా ఆ రోజుల్లో చిరంజీవి రాధా, రాధిక ,సుమలత, విజయశాంతి వంటి హీరోయిన్లతో రిపీట్ గా చాలా సినిమాలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే ఆయన సుమలతతో ప్రేమాయణం నడిపాడని.. వాళ్ళిద్దరూ కూడా డేటింగ్ చేసుకుంటున్న విషయం ఇంట్లో తెలిసి గొడవలు కూడా జరిగాయని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఈ వార్తలపై సుమలత అప్పట్లోనే చాలా తీవ్రంగా ఖండించింది. అంతేకాదు అలాంటి అసత్య ప్రచారాలు చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత చిరంజీవి రంగంలోకి దిగి చాలా సీరియస్ రియాక్ట్ అయి ఆపుకారులను ఖండించారు.
ఇక ఎప్పుడైతే ఇలాంటి రూమర్లు షికార్లు చేశాయో ఇక దాంతో వీళ్లిద్దరు సినిమాలు చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఇక అప్పటినుంచి ఎవరికీ వారు యమునా తీరే అన్నట్టుగానే వ్యవహరించారు. అలా ఉన్నా సరే సుమలత భర్త అంబరీష్ మెగాస్టార్ చిరంజీవికి ప్రాణ స్నేహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే . కానీ దురదృష్టవశాత్తు ఆయన కొంత కాలానికి కాలం చేశారు. ఇక ప్రస్తుతం సుమలత మళ్ళీ చిరంజీవి కుటుంబంతో కలిసిపోయింది.
మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!
మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!