చిరంజీవి సినిమాను ప్రొడ్యూస్ చేసే ఛాన్స్ కొట్టేసిన అనిల్ సుంకర

  • August 9, 2020 / 11:07 AM IST

ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి ఆర్టిస్టుకి చిరంజీవి ఒక్కసారైనా కలవాలని, ప్రతి డైరెక్టర్ కి ఆయనతో సినిమా తీయాలని, ప్రతి నిర్మాతకి ఆయన హీరోగా ఒక్క సినిమా అయినా నిర్మించాలని కలగనడం సహజం. అయితే ఆ కోరిక చాలా అరుదుగా నెరవేరుతుంటుంది. ఇప్పుడు ఆ నెరవేర్చుకున్న జాబితాలో అనిల్ సుంకర చేరారని తెలుస్తోంది. మహేష్ బాబు తో వరుస సినిమాలు నిర్మించిన అనిల్ సుంకర దర్శకుడిగానూ మారి చేతులు కాల్చుకున్నాడు. ఇటీవల “సరిలేరు నీకెవ్వరు”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని..

మధుబాబు నవల “షాడో” ఆధారంగా ఓటీటీ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమాను నిర్మించే అవకాశం అనిల్ సుంకర అందిపుచ్చుకున్నాడని తెలుస్తోంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళం ను రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని చరణ్ తో కలిసి అనిల్ సుంకర నిర్మిస్తారని తెలుస్తోంది. రీఎంట్రీ తర్వాత తాను నటించే ప్రతి చిత్రంలో హోమ్ ప్రొడక్షన్ ఇన్వాల్వ్ మెంట్ ఉండేలా జాగ్రత్తపడుతున్న చిరంజీవి..

వేదాళం రీమేక్ కు కూడా అదే ఫార్మాట్ ను ఫాలో అవుతున్నారు. మరి మెగా కాంపౌండ్ లోకి ఎంటర్ అయ్యే అవకాశాన్ని చేజిక్కించుకున్న అనిల్ సుంకర దాన్ని ఎంతవరకు సద్వినియోగపరుచుకుంటారో చూడాలి. చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలున్నాయి.

Most Recommended Video

ఎక్కువ రోజులు థియేటర్స్ లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్!
విడుదల కాకుండానే పైరసీ భారిన పడ్డ సినిమాలు ఎవేవంటే..?
ఈ బుల్లితెర నటీమణుల పారితోషికాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus