అల్లు రామలింగయ్య జయంతి నాడు అరుదైన ఫోటో పంచుకున్న చిరు

  • October 1, 2020 / 06:21 PM IST

లెజెండరీ నటుడు మరియు నిర్మాత అల్లు రామలింగయ్య 99వ జయంతి నేడు. కమెడియన్ గా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దశాబ్దాల పాటు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు అందించారు. ఆయన కుటుంబ సభ్యులు జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అల్లు వారి కుటుంబం అల్లు స్టూడియో పేరుతో ఆయన పేరున పెద్ద స్టూడియో నిర్మిస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్టూడియోకి సంబంధించిన ప్రారంభ కార్యక్రమం నేడు పూర్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నిర్మాత అల్లు అరవింద్, బన్నీ, అల్లు వెంకట్, శిరీష్ పాల్గొన్నారు. కాగా మెగాస్టార్ చిరంజీవి సైతం అల్లు రామలింగయ్యను స్మరించుకున్నారు. ఈ సంధర్భంగా అల్లు రామలింగయ్య కీర్తిని చిరు కొనియాడారు. నటుడిగా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, తత్వవేత్తగా, ఆయుర్వేద్య వైద్యుడిగా ఆయన అనేక రంగాలలో రాణించారు అన్నారు. వచ్చే ఏడాది శత జయంతి సంధర్భంగా ఆయన జీవితం ఆవిష్కరించాలని కోరుకున్నారు. ఈ సంధర్భంగా చిరంజీవి పెళ్ళినాటి ఫోటో పంచుకున్నారు.

పెళ్లి పందిరిలో మామ అల్లు రామలింగయ్య అల్లుడు చిరంజీవిని ఆశీర్వదిస్తూ ఉండగా, చిరంజీవి ఆయనకు నమస్కరిస్తున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటి ఫోటో చిరు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Most Recommended Video

బిగ్‌బాస్‌లో రోజూ వినే గొంతు… ఈయనదే!
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!
కోలీవుడ్లో ఎక్కువ పారితోషికం తీసుకునే హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus