Chiranjeevi: అభిమానులను అలా చేయమంటున్న మెగాస్టార్!

Advertisement

స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి డ్యాన్స్, డైలాగ్స్, స్టైల్ ను ఇష్టపడే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు. చిరంజీవి సినిమాలకు భారీస్థాయిలో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. రేపు మెగాస్టార్ పుట్టినరోజు కావడంతో రేపు వచ్చే అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రెండు పాటలు మినహా ఆచార్య షూటింగ్ ను పూర్తి చేసిన చిరంజీవి ప్రస్తుతం లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

స్టార్ డైరెక్టర్ల కంటే టాలెంట్ ఉన్న డైరెక్టర్లకే ఎక్కువగా అవకాశాలను ఇస్తున్న మెగాస్టార్ యంగ్ టాలెంట్ ను ప్రోత్సహిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనాలని మూడు మొక్కలను నాటి ట్విట్టర్ లో తనకు ట్యాగ్ చేయాలని అభిమానులకు సూచనలు చేశారు. కాలుష్యంకు చెక్ పెట్టాలన్నా, భవిష్యత్ తరాలు బాగుండాలన్నా మొక్కలు నాటడం మాత్రమే మార్గమని చిరంజీవి చెప్పుకొచ్చారు. చిరంజీవి విజ్ఞప్తి విషయంలో ఆయన అభిమానులు, నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

65 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి ఫిట్ గా ఉండటంతో పాటు వరుసగా సినిమాల్లో నటిస్తుండటం గమనార్హం. వచ్చే ఏడాది చిరంజీవి నటిస్తున్న రెండు సినిమాలు రిలీజయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ మధ్య కాలంలో చిరంజీవి ఎక్కువగా రీమేక్ కథలను ఎంచుకుంటున్నారు. చిరంజీవి, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ గురించి రేపు క్లారిటీ రానుంది.


Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus