Chiranjeevi: ఘనంగా చరణ్, ఉపాసన ..ల ట్విన్స్ బారసాల వేడుక.. వైరల్ అవుతున్న ఫోటో

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకి ఇటీవల కవలలు జన్మించిన సంగతి తెలిసిందే.జనవరి 31న ఉపాసనకి డెలివరీ అయ్యింది. ఇక కావలల్లో ఒకరు పాప, ఇంకొకరు బాబు ఉన్నారు. మనవడు కావాలనుకున్న చిరు(Chiranjeevi) కోరిక కూడా తీరింది. ఆ కవలలకు బారసాల వేడుకని కూడా నిర్వహించారు మెగా ఫ్యామిలీ మెంబర్స్. ఫిబ్రవరి 11న ఆ వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా.. బాబుకి శివ రామ్ అని,పాపకి అన్వీరా దేవి అని నామకరణం చేశారు.

Chiranjeevi

శివ రామ్ పేరుని గమనిస్తే చిరు, చరణ్ రిఫరెన్సులు కనిపిస్తాయి. చిరంజీవి అసలు పేరు శివ శంకర వరప్రసాద్. అందులోని శివని తీసుకున్నారు. అలాగే రామ్ చరణ్ లో రామ్ ని కూడా తీసుకున్నట్టు మనం గుర్తించొచ్చు. అలాగే పాప అన్వీరా దేవి పేరుని గమనిస్తే.. చిరు తల్లి అంజలి దేవి రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక బారసాలకి సంబంధించిన ఒక ఫోటోని చిరు, ఉపాసన తమ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ ఫొటోలో చిరు ఒక బేబీని ఎత్తుకుని మురిసిపోతున్నారు. అలాగే ఉపాసన తల్లి కూడా ఓ బేబీని ఎత్తుకున్నారు. మరోపక్క పెద్ద పాప క్లీంకార చరణ్ ఒడిలో కూర్చుంది. ఆమె ఫేస్ రివీల్ కాకుండా బ్లర్ చేసి వదిలారు.ఉపాసన చేతిలో మైక్ ఉంది కాబట్టి… ఆమె పిల్లల పేర్లు చదువుతున్నట్టు మనం అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదంతా చూస్తున్న చిరు సతీమణి సురేఖ కూడా మురిసిపోతూ కనిపించారు. ఈ ఫోటో మెగా అభిమానులకి ఫీస్ట్ ఇచ్చేలా ఉంది.

చికిరి హుక్ స్టెప్.. చరణ్ ఇన్వాల్వ్మెంట్.. గ్రేట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus