Chiranjeevi, Venkatesh: వెంకీ బర్త్ డే స్పెషల్… విషెస్ తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి!

  • December 13, 2022 / 03:45 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ నేడు పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు హీరో వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక డిసెంబర్ 13వ తేదీ వెంకీ పుట్టినరోజు కావడంతో ఈయన 62వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇలా ఆరు పదుల వయసులో కూడా వెంకటేష్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇక నేడు పుట్టినరోజు జరుపుకోవడంతో వెంకటేష్ కు మెగాస్టార్ చిరంజీవి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. మై డియర్ వెంకీ.. హ్యాపీ బర్త్డే…వేర్ ఇస్ ద పార్టీ అంటూ వెంకటేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా స్పెషల్ గా చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేయడంతో మెగా అభిమానులు క్రేజీ విషెస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇలా వెంకటేష్ అభిమానులతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా వెంకటేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక వెంకటేష్ కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన ఎఫ్3 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక విశ్వక్సేన్ నటించిన ఓరి దేవుడా సినిమాలో దేవుడి పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఇక నేడు వెంకటేష్ పుట్టినరోజు కావడంతో ఈయన నటించిన నారప్ప సినిమాని తిరిగి థియేటర్ లో విడుదల చేశారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus