Chiranjeevi: ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నాగబాబుకు చిరు వార్నింగ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి త్వరలోనే ప్రేమ వివాహం చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి వీరిద్దరూ ఇప్పటికే పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే వీరి వివాహం ఈ ఏడాది చివర నవంబర్ లేదా డిసెంబర్ నెలలో ఉండబోతుందని వెల్లడించారు. ఇక వరుణ్ తేజ్ తన వివాహాన్ని విదేశాలలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోబోతున్నారు.

ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇదిలా ఉండగా తాజాగా వరుణ్ తేజ్ పెళ్లి విషయమై చిరంజీవి నాగబాబుకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది. అసలు ఏ విషయం గురించి చిరంజీవి (Chiranjeevi) నాగబాబుపై సీరియస్ అయ్యారనే విషయానికి వస్తే… నిహారిక పెళ్లి విషయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పెద్ద తప్పు చేశారని ఆ తప్పు కారణంగానే నిహారిక విడాకులు తీసుకుంది అంటూ కూడా గతంలో వార్తలు వచ్చాయి.

మరి నిహారిక పెళ్లి సమయంలో ఫోటోలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సరైన ముహూర్తానికి పెళ్లి జరగలేదట ఇలా సరైన ముహూర్తానికి పెళ్లి జరగకపోవటం వల్లే ఆమె పెళ్లి బంధం ఎక్కువ కాలం నిలబడలేదని అయితే అదే తప్పు వరుణ్ విషయంలో జరగకూడదని చెప్పారట. పంతులు నిర్ణయించిన ముహూర్తానికే వరుణ్ తేజ్ లావణ్య వివాహం జరగాలని అదే సమయానికి మాంగళ్యధారణ జరగాలని అలా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ముందుగానే సూచించారని తెలుస్తోంది.

నిహారిక విషయంలో జరిగిన తప్పు మరొకసారి పునరావృతం కాకుండా ముందుగానే జాగ్రత్త పడాలని పెళ్ళిలో ప్రతి ఒక్క కార్యం కూడా నిశ్చయించిన ముహూర్తానికి జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారట.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus