Chiranjeevi: గోపీచంద్ డైరెక్టర్ కు మెగాస్టార్ టైటిల్ కు సంబంధం ఏంటి?

  • August 3, 2021 / 07:05 PM IST

నిజమే గోపీచంద్ డైరెక్టర్ కి.. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ కి సంబంధం ఏంటి? పైన టైటిల్స్ ను చూసిన ఎవరికైనా ఇదే డౌట్ వస్తుంది. విషయంలోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మ‌ల‌యాళం సూపర్ హిట్ మూవీ ‘లూసీఫ‌ర్‌’… తెలుగులోకి రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. మోహ‌న్ రాజా ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.ఎన్వీ ప్రసాద్, చరణ్ లు నిర్మాతలు కావడం విశేషం. ఇదిలా ఉండగా… ఈ చిత్రానికి ‘గాడ్ ఫాద‌ర్‌’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు కొద్దిరోజుల నుండీ ప్ర‌చారం జ‌రుగుతోంది.

చిరు కూడా ఈ టైటిల్ కే ఎక్కువ మక్కువ చూపారట.అయితే ఈ టైటిల్ ను ఖరారు చేస్తూ ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. దీనికి కారణం సంపత్ నంది అని తెలుస్తుంది.నిజానికి ఈ టైటిల్ దర్శకుడు సంప‌త్ నంది వద్ద ఉందట.ఆల్రెడీ ‘గాడ్ ఫాద‌ర్‌’ పేరుతో సంప‌త్ నంది… ఓ క‌థ రాసుకోవడం అలాగే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసి పెట్టుకోవడం జరిగిందట.అయితే ఈ టైటిల్ ను తన సినిమాకి ఇవ్వాల్సిందిగా చిరంజీవి.. సంప‌త్ నందికి ఫోన్ చేసి రిక్వస్ట్ చేశారట.అందుకు అతను కూడా సంతోషంగా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది.

‘చిరు వద్ద నుండీ ఫోన్ రావడమే.. తనకు బోలెడంత సంతృప్తిని ఇచ్చిందని’ సంపత్.. తన సన్నిహితుల వద్ద చెప్పినట్టు తెలుస్తుంది.సంప‌త్ నంది `గాడ్ ఫాద‌ర్‌` టైటిల్ ఇవ్వడానికి అంగీకరించడంతో… చిరు టీం ఈ టైటిల్ ని అధికారికంగా ప్ర‌క‌టించేందుకు సన్నాహాలు చేస్తుందట. ఆగష్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కంటే ముందే ఈ చిత్రం టైటిల్ తో కూడుకున్న పోస్టర్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus