తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!

సెకండ్ వేవ్ కారణంగా మూతపడిన థియేటర్లు ఈరోజు ‘తిమ్మరుసు’ మూవీతో తెరుచుకున్నాయి. ట్యాలెంటెడ్ హీరో సత్యదేవ్ హీరోగా తెరకెక్కిన మూవీ ఇది. గతేడాది ఇదే రోజున ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రంతో ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చి హిట్ అందుకున్న సత్యదేవ్.. ఈ ఏడాది ‘తిమ్మరుసు’ మూవీతో థియేటర్లు ఓపెన్ అయ్యేలా చేసి మన ముందుకు రావడం విశేషం. ‘బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’ అనే కన్నడ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. తొలిసారి సత్యదేవ్ లాయర్ పాత్రని పోషించాడు. ఈ ఏడాది వచ్చిన ‘నాంది’ ‘వకీల్ సాబ్’ వంటి కోర్ట్ డ్రామాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ‘తిమ్మరుసు’ పై కూడా అందరికీ ఆసక్తి పెరిగింది. మరి ఈ చిత్రం మెప్పించిందా? లేదా? అనే విషయాన్ని ఓ లుక్కేద్దాం రండి :

కథ: పోలీస్ ఇన్ఫార్మ‌ర్ గా ఉన్న ఓ క్యాబ్ డ్రైవ‌ర్ ని కొంతమంది దుండగులు హ‌త్య‌ చేస్తారు. ఈ సంఘటనని ఓ కుర్రాడు చూస్తాడు.అతను పోలీసులకి ఈ సమాచారం అందిస్తాడు. కానీ ఆ హత్య చేసింది ఈ కుర్రాడే అని ఓ అవినీతి పోలీస్ అధికారి అన్యాయంగా అతన్ని అరెస్ట్ చేయించి.. 8 సంవత్సరాలు జైలు శిక్ష పడేలా చేస్తాడు.సరిగ్గా 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత లాయ‌ర్ రామ‌చంద్ర‌(స‌త్య‌దేవ్) ఆ కేసును రీఓపెన్ చేయించి, నిజా నిజాల్ని నిరూపించి.. అసలు నేరస్థులకు శిక్ష ప‌డేలా చేస్తాడు. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ ఎవరు? అతని కేసుని 8 ఏళ్ళ తర్వాత హీరో ఎందుకు రీ ఓపెన్ చేయించాడు? అనేది తెరపై చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: డౌట్ లేదు హీరో సత్యదేవ్ అద్భుతంగా నటించాడు. అతని డైలాగ్ డెలివరీ కూడా సూపర్ అనే చెప్పాలి.ఆ విషయం ఇదివరకే ప్రూవ్ అయినా ఈసారి మరింతగా అట్రాక్ట్ చేసింది అనే ఫీలింగ్ కలిగిస్తుంది. ఇప్పటివరకు సత్యదేవ్ ఎన్నో వైవిధ్యమైన మరియు థ్రిల్లర్ మూవీస్ లో నటించాడు కానీ.. అందులో ‘యాక్షన్ సన్నివేశాలు లేవే…!’ అనే చిన్న లోటు ఉంటుంది. కానీ ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. అందులో కూడా సత్యదేవ్ బాగా చేసాడు అనే చెప్పాలి. లిఫ్ట్ లో వచ్చే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. యాక్షన్ సినిమాల్లో కూడా సత్యదేవ్ బాగా నటించగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.

చేయని తప్పుకి శిక్ష అనుభవించే వాసు.. పాత్రను పోషించిన నటుడు అంకిత్ కూడా బాగానే చేసాడు. అతనికి ఈ సినిమా ప్లస్ అవుతుంది. ముందు ముందు ఇతనికి మరిన్ని మంచి అవకాశాలు రావొచ్చు.

హీరోయిన్ ప్రియాంక జవాల్కర్‌ రోల్ పెద్దగా ఆకట్టుకోదు.ఆమె పాత్రకి కూడా పెద్దగా ప్రాధాన్యత ఉండదు.కానీ ఆమె స్క్రీన్ అప్పీరెన్స్ బాగుంది.సినిమాలో గ్లామర్ లేదు అనే రిమార్క్ పడకూడదు అని దర్శకుడు ఆమెను ఇరికించినట్టు ఉన్నాడు. ఇక బ్రహ్మాజీ.. కామెడీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. సుధాకర్ పాత్రలో అతను ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ కొట్టేసాడు.అతని పంచ్ లకి ప్రేక్షకులు హ్యాపీగా నవ్వుకుంటారు. ఇక రవిబాబు కూడా పర్వాలేదు అనిపించే విధంగా చేసాడు. ఝాన్సీ, అజయ్.. వంటి వారు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ అప్పు ప్రభాకర్ గురించి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సాగే ఈ చిత్రానికి మెయిన్ హైలెట్ గా నిలిచింది అతని సినిమాటోగ్రఫీనే.ఇక దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి ఈ చిత్రాన్ని మలిచిన తీరుకి ప్రశంసలు దక్కుతాయి. టీజర్,ట్రైలర్ వంటివి చూసి ఇది కోర్ట్ డ్రామా కాబట్టి.. వాదనలు ఎక్కువగా ఉంటాయి అని అంతా అనుకుంటారు. కానీ వాటి జోలికి పోకుండా ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్ గా దీనిని నడిపించి ఆకట్టుకున్నాడు.ఈ సినిమాని అతను 39 రోజుల్లోనే తెరకెక్కించినట్టు చిత్ర యూనిట్ సభ్యులు చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అంతే స్పీడ్ గా స్క్రీన్ ప్లే కూడా సాగుతుంది.చిన్న చిన్న లాజిక్‌లు మిస్ అవ్వడం,క్లైమాక్స్ హడావిడిగా ముగించడం వంటివి లోటుగా అనిపిస్తాయి. అలాగే ఫస్ట్ హాఫ్ పై కూడా దర్శకుడు ఇంకాస్త శ్రద్ధ పెట్టుంటే బాగుండేది అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. కానీ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అతను బాగా రాసుకున్నాడు. అక్కడి నుండీ సినిమా గ్రాఫ్ ను పెంచుతూ వచ్చాడు . సెకండ్ హాఫ్ లో ప్రేక్షకులను కదలకుండా కూర్చోబెట్టడంలో అతను సక్సెస్ అయ్యాడు. ఒరిజినల్ కంటే కూడా ఈ చిత్రాన్ని మరింత ఆసక్తికరంగా మలిచాడు శరణ్. ఇక సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల అందించిన నేపధ్య సంగీతం కూడా ఓకే అనిపిస్తుంది. వేద వ్యాస్ రాసిన సంభాషణలు కూడా ఆకట్టుకుంటాయి.

విశ్లేషణ: ఒరిజినల్ అయిన ‘బీర్బల్ త్రయం కేస్ 1: ఫైండింగ్ వజ్రముని’ ని ఎంతమంది చూసుంటారో తెలీదు. ఒకవేళ చూసినా… వాళ్ళని కూడా ‘తిమ్మరుసు’ ఆకట్టుకుంటాడు అనడంలో అతిశయోక్తి లేదు. అక్కడక్కడా లాజిక్ లు మిస్ అయినా..ఫస్ట్ హాఫ్ స్లో అయినా.. చిన్న సినిమా కాబట్టి అవి పెద్ద మిస్టేక్ లు అన్నట్టు అనిపించవు. ఒకసారి డౌట్ పడకుండా థియేటర్ కు వెళ్ళి చూడదగ్గ చిత్రం ‘తిమ్మరుసు’.

రేటింగ్: 2.5/5 

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus