Chiranjeevi, Bobby: చిరు – బాబీ సినిమా గురించి తమన్‌ ఆసక్తికర ట్వీట్‌!

Advertisement

చిరంజీవితో కొత్త తరం దర్శకులు సినిమాలు చేసేటప్పుడు కచ్చితంగా చెప్పే మాటల్లో… ‘గ్యాంగ్‌ లీడర్‌’ లాంటి చిరంజీవిని చూపిస్తాం’ అనే మాట కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి లుక్స్‌లో ‘గ్యాంగ్‌ లీడర్‌’ లుక్‌ అంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది మరి. గెడ్డం, ఒత్తైన జట్టుతో అసలు సిసలు మాస్‌ హీరోలా కనిపిస్తాడు చిరు. అందుకే కొత్త దర్శకులు ఆ మాట అంటుంటారు. ఇప్పుడు బాబీ కూడా అదే మాట అన్నాడు. అంతేకాదు దానిని సంగీత దర్శకుడు తమన్‌ దానిని బలపరిచాడు. ఈ మేరకు తమన్‌ ఓ ట్వీట్‌ చేశాడు.

Click Here To Watch Now

‘‘చిరంజీవిని ఇప్పుడే కలిశాను. ఆయన లుక్స్‌ అదిరిపోయాయి. డైరక్టర్‌ బాబీ నువ్వు నిజమైన అభిమానివి. గ్యాంగ్‌ లీడర్‌ లుక్‌లో చిరంజీవిని చూపిస్తున్నావ్‌. అదరగొట్టావ్‌’’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు తమన్‌. అంతేకాదు చిరంజీవిని కలిశాక నాలో ఒక ఉత్సాహం వస్తుంది. ఆయన చూపించే ప్రేమ, అభిమానం అద్భుతం అంటూ ట్వీట్‌ చేశాడు తమన్‌. గతంలో ఒకటి రెండసార్లు బాబీ ఇదే మాట చెప్పారు. ఆ తర్వాత విడుదల చేసిన ప్రీలుక్‌, లుక్‌లో అదే కనిపించింది. ఇప్పుడు తమన్‌ కూడా అదే మాట అనడంతో అభిమానుల ఉత్సాహం మరింత ఎక్కువైంది.

రీఎంట్రీలో చిరంజీవి జోరు చూపిస్తున్న విషయం తెలిసిందే. కుర్ర స్టార్‌ హీరో తరహాలో వరుస సినిమాలు ఓకే చేస్తూ వస్తున్నాడు. అలా చిరంజీవి లైనప్‌లో ఇప్పుడు నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం మోహన్‌ రాజా దర్శకత్వంలో ‘గాడ్‌ ఫాదర్‌’ చేస్తున్నారు. మలయాళ సూపర్‌ హిట్‌ చిత్రం మోహన్‌లాల్‌ ‘లూసిఫర్‌’కి రీమేక్‌ ఇది. ఇది కాకుండా బాబీ – మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమా చేస్తున్నాడు. మరోవైపు మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ‘భోళా శంకర్‌’ తెరకెక్కుతోంది వీటితోపాటు డీవీవీ దానయ్య – వెంకీ కుడుముల కాంబినేషన్‌ని ఇటీవల అనౌన్స్‌ చేశారు.

ఈ సినిమాలన్నీ దేనికవే వైవిధ్యమైన కథలు. అలాగే పాత్రల చిత్రణ కూడా కొత్తగానే ఉంటుంది. కాబట్టి చిరంజీవి కెరీర్‌లో రానున్న రోజులు డిఫరెంట్‌గా ఉండబోతున్నాయి. పనిలో పనిగా ఆయన అభిమానులకు కూడా వైవిధ్యమైన వినోదం అందనుంది. సో… మెగా ఫ్యాన్స్‌ ‘గ్యాంగ్‌ లీడర్‌’ లుక్‌తోపాటు ఆ నాటి రోజుల గురించి కూడా వెయిట్‌ చేయండి.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus