Bigg Boss Non-Stop: బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ అనేది వారియర్స్ వర్సెస్ ఛాలెంజర్స్ మద్యలో జరగబోతోంది. ఈ రియాలిటీ షో డిస్నీహాట్ స్టార్ లో 24X7 ఉండబోతోంది. మొత్తం 84రోజుల పాటుగా ఈ ఎంటర్ టైన్మెంట్ షో రన్ చేయబోతున్నారు. అయితే, దీన్ని రెండు ఎపిసోడ్స్ గా హాట్ స్టార్ లో పెడతారు. ఎవరైనా లైవ్ అప్డేట్స్ మిస్ అయిన వాళ్లు ఇందులో చూస్కోవచ్చు. ఇక శనివారం అంగరంగా వైభవంగా స్టార్ట్ అయిన ఈ రియాలిటీ షోని నాగార్జున తనదైన స్టైల్లో లీడ్ చేశాడు. ఒక్కొక్క హౌస్ మేట్ ని పరిచయం చేశారు. ఇందులో ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్స్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్లు, కొత్తవాళ్లు కలిసి ఉన్నారు. మొత్తం 17మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లని మనం ఒక్కసారి చూసినట్లయితే, ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా ఎంటర్ టైన్ చేసేందుకు సిద్ధం అయిపోయారు.

1. అషూరెడ్డి

పిచ్చెక్కిస్తా అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది. వస్తూనే హౌస్ చూసి థ్రిల్ అయిపోయింది. రీసంట్ గా డిజిటల్ మీడియాలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న అషూ వచ్చే హౌస్ మేట్స్ ని రిసీవ్ చేస్కోవడంలో బిజీ అయిపోయింది.

2. మహేష్ విట్టా

ఊరమాస్ అనే యాష్ ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చాడు. సీజన్ 3లో దాదాపు 12 వారాల పాటు ఉన్న మహేష్ విట్టా తనదైన స్టైల్లో అప్పుడు ఎంటర్ టైన్ చేశాడు. ఇప్పుడు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తూ ఫుల్ ఊరమాస్ ఎంటర్ టైన్ చూపిస్తానంటూ చెప్పాడు.

3. ముమైత్ ఖాన్

డైనమైట్ అనే ట్యాగ్ తో ఎంట్రీ ఇచ్చింది. ముమైత్ ఖాన్ సీజన్ 1లో అందరికీ బాగా పరిచయమే. బిగ్ బాస్ హౌస్ లో చాలా విలక్షణంగా గేమ్ ఆడింది. మద్యలో బయటకి వచ్చి మరీ హౌస్ లోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చింది. ధనరాజ్ కి ముమైత్ ఖాన్ కి అప్పట్లో బాగా జోడీ కుదిరింది. బ్రదర్ అండ్ సిస్టర్ గా మంచి సెంటిమెంట్ ని పండించారు ఇద్దరూ. మరి ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి.

4. అజయ్ కతుర్ వార్

అసలు ఎవరో కూడా తెలియని ఒక వ్యక్తి హౌస్ లోకి వచ్చాడు. కట్ చేస్తే తను అప్ కమింగ్ యాక్టర్ అని తను పడిన కష్టాలు చెప్పేసరికి దిమ్మతిరిగిపోయింది. యాక్టర్ గా డైరెక్టర్ గా ఒక మూవీతో రాబోతున్నాడట అజయ్. అయితే, అజయ్ కి గతంలో పెద్ద యాక్సిడెంట్ అయ్యిందట. అప్పుడు 8 నెలలపాటు అసలు బెడ్ పైనే ఉండిపోయానని, మొత్తం పెరాలసిస్ లాగా కాళ్లు చేతులు పడిపోయాయని చెప్పాడు. నాగార్జుననే ఇన్సిపిరేషన్ గా తీస్కుని ఓవర్ కమ్ అయ్యి, ఇప్పుడు హీరో కమ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టానని అంటున్నాడు. సంకీగాడు అనే యాష్ ట్యాగ్ ని ఎంచుకున్న అజయ్. తను నమ్మిన బాటలో గుడ్డిగా, మొండిగా వెళ్లిపోవడమే అని చెప్తున్నాడు.

5. స్రవంతి చొక్కారపు

యాంకర్ గా సుపరిచుతురాలే. తను ఎవరికీ చెప్పని సీక్రెట్ ఒకటి నాన్ స్టాప్ ఓటీటీలో చెప్పేసింది. తను రెండు పెళ్లిళ్లు చేస్కున్నానిి, మొదటి పెళ్లి ప్రేమించి చేస్కుంటే అది సెట్ అవ్వలేదని చెప్పింది. తర్వాత పెళ్లి పెద్దలు కుదిర్చి చేశారట. ఇప్పుడు అదే ఇంటి పేరుని తన పేరుకి తగిలించుకుని స్రవంతి చొక్కారపు అయ్యాయనని చెప్పింది. అంతేకాదు, ఇప్పటి వరకూ బిగ్ బాస్ లో లేడీ విన్నర్ ఎవరూ అవ్వలేదని, అది నేనే అవుతానని కాన్ఫిడెంట్ గా చెప్పింది. నవరసాలతో ఎంటర్ టైన్ చేస్తానని నవరసాల ట్యాగ్ ని ఎంచుకుంది ఈ అమ్మడు.

6. ఆర్జే చైతన్య

ఆర్జేగా అందరికీ వినిపించే చైతన్య ప్రేక్షకులందరికీ కనిపించాడు. అంతేకాదు, తను ఎన్ని కష్టాలు పడిందో కూడా కళ్లకి కట్టినట్లుగా ఎవిలో చూపించాడు. నిజానికి ఆర్జే చైతూ మంచి భోజన ప్రియుడు. ఫుడ్ బాగా లాగించేస్తానని చెప్పాడు. అంతేకాదు, డబుల్ డిజిట్ లో తన వెయిట్ ఎప్పటికైనా రావాలంట. ఛాటర్ బాక్స్ అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మనోడు.

7. అరియానా గ్లోరీ

సీజన్ 4లో తన లాజిక్స్ తో మాటలతో పిచ్చెక్కించిన అరియానా గ్లోరీ ఎంట్రీ ఇరగదీసింది. లేడీ విన్నర్ అవ్వాలనే లక్ష్యంతో హౌస్ లోకి అడుగుపెట్టింది. అన్ని విషయాలు ఓపెన్ గా చెప్పే అరియానా మాత్రం సీక్రెట్ భాయ్ ఫ్రెండ్ గురించి అస్సలు చెప్పనని చెప్పింది. ట్రూత్ ఫుల్ గా ఉంటానని, తనకి తాను ఎలా ఉంటానో గేమ్ లో చూపిస్తానని చెప్పింది.

8. నటరాజ్ మాస్టర్

రీసంట్ గా పుట్టిన తన పాపా ఫోటోని గిఫ్ట్ గా తీస్కుని హౌస్ లో కి అడుగుపెట్టాడు. రోరింగ్ లైన్ అంటూ యాష్ ట్యాగ్ తో తన టాలెంట్ మరోసారి చూపించేందుకు సిద్ధం అయ్యాడు.

9. శ్రీరాపక

వెస్ట్ గోదావరి లో పుట్టినా హైదరాబాద్ లో పెరిగింది. యాక్టర్ అండ్ ఫ్యాషన్ డిజైనర్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. నిజానికి వాళ్లది చిన్నప్పటి నుంచీ రాయల్ ఫ్యామిలీ అని, రాణిలా పెరిగానని చెప్పుకొచ్చింది. చిన్నప్పుడు కబడ్డీ, ఖోకో లో ఎన్నో మెడల్స్ గెలిచింది. ఇప్పుడు హౌస్ లో అందర్నీ కబడ్డీ ఆడుకునే రేస్ గుర్రం లా అడుగుపెట్టింది.

10. అనిల్

ఫ్యాషన్ రంగంలో తను ఒక మోడల్. నాన్న పోలీస్, తాత పోలీస్ అయినా కూడా తను మాత్రం మోడల్ గా ఎదిగాడు. మొదట్లో ఇంట్లో ఎవరికీ ఇష్టం లేకపోయినా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునే సరికి ఇంట్లో సరే అన్నారు. ఇండియా, తెలంగాణా, ఎపీ నుంచీ మోడలింగ్ లో రిప్రజెంట్ చేశాడు. యంగ్ ఏజ్ లోనే హైదరాబాద్ లో బెస్ట్ మోడల్ గా ఎదిగాడు. బిగ్ బాస్ మంచి ఫ్లాట్ ఫార్మ్ అని ఎప్పుడూ గివ్ అప్ ఇవ్వను అంటూ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

11. మిత్రా శర్మ

ముంబై నుంచీ వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయిన అమ్మాయి. చిన్న సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూనే శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ ని స్థాపించి బాయ్స్ అనే సినిమాని ప్రొడ్యూస్ చేసింది. అంతేకాదు, తన పూర్తి పేరు మిత్ర బిందా అని చెప్తూ, మగధీరుడు కోసం వెతుకుతున్నానని చెప్పింది. కీప్ స్మైలింగ్ అంటూ డ్రామా అనే యాష్ ట్యాగ్ తో హౌస్ లోకి అడుగుపెట్టింది మిత్ర.

12. తేజస్విని మడివాడ

బిగ్ బాస్ సీజన్ 2లో కౌషల్ వల్ల కొద్దిగా నెగిటివిటీ వచ్చినా కూడా ఈసారి మాత్రం తను ఎలా ఎంటర్ టైన్ చేయగలనో చూపిస్తా అంటూ చెప్తోంది. అంతేకాదు, నాకు చాలా మాడ్ నెస్ ఉందని అందంతా కూడా చూపిస్తానని, ఆడియన్స్ కి ఇంకా ఎంటర్ టైన్మెంట్ రుణపడి ఉన్నా అని అంటోంది తేజస్విని.

13. సరయు

7 ఆర్ట్స్ యూట్యూబర్ గా సీజన్ 5లో ఇలా వెళ్లి అలా వచ్చిన సరయు , ఈసారి మాత్రం స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఈసారి ఎన్ని వారాలు ఉంటుంది అనేది ఆసక్తికరం.

14. యాంకర్ శివ

యూట్యూబ్ లో తనదైన స్టైల్లో ఇంటర్య్వూస్ చేసే శివ చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాలు పడ్డాడట. శ్రీకాకుళంలో పుట్టినా, వైజాగ్ లో చదువుకున్నాడు. నాన్నగారిది కూరగాయల వ్యాపారం అని, ఎన్నో ఫ్యామిలీ ట్రబుల్స్ తో యాంకర్ అయ్యానని చెప్పాడు. అంతేకాదు, తను ఎదగాలనుకున్న ఛానల్ లోనే డ్రైవర్ గా పనిచేశానని కూడా చెప్పాడు. కొన్ని కారణాల వల్ల ఇంటి నుంచీ బయటకి వచ్చేశాడు. వాళ్ల మదర్ కి మదర్ కి తను ఇంట్లో ఉండటం అస్సలు నచ్చలేదట. బిగ్ బాస్ హౌస్ లో డబ్బు గెలవాలి. చెల్లి పెళ్లి చేయాలంటున్నాడు శివ. మసాలా ట్యాగ్ తో హౌస్ లోకి మస్త్ గా ఎంట్రీ ఇచ్చాడు.

15. బిందు మాధవి

హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచుతురాలు. కెరియర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు బ్రేక్ ఇచ్చింది. అప్పట్నుంచీ ఏమై పోయిందో కూడా తెలియకుండా ఫేడ్ అవుట్ అయ్యింది. అయితే, అప్పట్లో తమిళ బిగ్ బాస్ లో తళుక్కుమని దర్సనమిచ్చింది. వైల్డ్ కార్డ్ గా అందులో వెళ్లిన బిందు మాధవి మిడ్ వీక్ ఎవిక్షన్ వల్ల టైటిల్ విన్నర్ కాలేకపోయింది. తన లవ్ ఫెయిల్యూర్ వల్ల అప్పట్లో బాగా డిప్రెషన్ లోకి వెళ్లిందట. అంతేకాదు, తనది చిత్తూర్ జిల్లా మదనపల్లి అని అయినా కూడా తెలుగు వాళ్లకి దగ్గరవ్వలేకపోయాననే బాధతోనే బిగ్బాస్ లోకి ఎంట్రీ ఇస్తోందట. మస్తీ చేస్తానంటూ ట్యాగ్ తో హౌస్ లోకి ఖుషీగా ఎంట్రీ ఇచ్చింది.

16. హమీదా

సీజన్ 5 లో శ్రీరామ్ చంద్రతో చేసిన లవ్ ట్రాక్ ఇంకా ఆడియన్స్ మర్చిపోక ముందే మరోసారి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాన్ స్టాప్ హౌస్ లో టాస్క్ లో మరోసారి తన దైన స్టైల్ లో రెచ్చిపోయి గేమ్ ఆడతా అంటోంది. తగ్గేదేలే అంటూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది అమ్మడు.

17. అఖిల్ సార్ధక్

ఫైనల్ గా ట్రోపీ విన్నర్ కావాలంటూ అఖిల్ ఎంట్రీ ఇచ్చాడు. అంతేకాదు, తను సీజన్ 4లో మిస్ అయిన ట్రోపీని స్టేజ్ పైన మరోసారి చూస్కుని మరీ హౌస్ లోకి అడుగుపెట్టాడు.

మొత్తానికి 17మంది సీనియర్స్, జూనియర్స్ కలబోతతో వారియర్స్ అండ్ ఛాలెంజర్స్ గా నాన్ స్టాప్ బిగ్ బాస్ అనేది స్టార్ట్ అయ్యింది. అదీ మేటర్.

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus