కొరటాల తో ‘మెగా 152’ ఫిక్స్… త్వరలోనే షూటింగ్ ప్రారంభం… ?

  • December 8, 2018 / 02:37 PM IST

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహ రెడ్డి’ చిత్ర షూటింగ్ లో బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే. చిరంజీవి 151 వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తరువాత కొరటాల శివ డైరెక్షన్లో ‘మెగాస్టార్ 152’ వ చిత్రం తెరకెక్కబోతోందంటూ గత కొంత కాలంగా వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందని… సో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కొరటాల ఓ చిత్రం తీయబోతున్నారంటూ మరో వార్త వచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతుంది.

కొరటాల శివ ప్రస్తుతం ‘మెగాస్టార్ 152’ వ చిత్రం యొక్క స్క్రిప్ట్ పనిలోనే బిజీగా ఉన్నాడట . ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయని సమాచారం. జనవరిలో చివరి వారంలో ఈ చిత్రాన్ని లాంచ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ తో ‘సైరా’ లో నటిస్తున్న నయనతారనే హీరోయిన్ గా సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. కొరటాల చిత్రాల్లో హీరోయిన్ కు ఎప్పుడూ మంచి ప్రాధాన్యత ఉంటుందనేది తెలిసిన విషయమే. అందుకే ఈ చిత్రంలో కూడా నయనతారను తీసుకుంటున్నారంటూ ఫిలింనగర్లో చెప్పుకొస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటించబోతున్నట్టు సమాచారం. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus