‘శ్రీదేవి సోడా సెంటర్’ : 3వ పాట కూడా సూపర్ హిట్టే..!

  • August 17, 2021 / 01:54 PM IST

సుధీర్‌ బాబు హీరోగా ‘పలాస 1978′ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’. ‘భ‌లే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మా’ ‘యాత్ర’ వంటి హిట్ సినిమాలను నిర్మించిన ’70.ఎం.ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్’ అధినేతలు.. విజయ్ చిల్లా, శశి దేవి‌రెడ్డి లు ఈ చిత్రానికి నిర్మాతలు.ఇప్పటికే విడుదల చేసిన వీడియో గ్లిమ్ప్స్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్ లకు మంచి స్పందన లభించింది.

ఇక ఆగష్ట్ 27న ఈ చిత్రం విడుదల కాబోతుండడంతో ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుండీ థర్డ్ సింగిల్ ను కూడా కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ‘చుక్కల మేళం.. దిక్కుల తాళం.. ఒక్కటి అయ్యే ఈ సంబరం’ అంటూ సాగే ఈ పాట శ్రోతలను ఆకట్టుకునే విధంగానే ఉంది. సంగీత దర్శకుడు మణిశర్మ అందించిన ట్యూన్.. అనురాగ్ కులకర్ణి పాడిన విధానం.. కళ్యాణ్ చక్రవర్తి అందించిన లిరిక్స్ కలగలిపి..

ఈ పాటని రెండు, మూడు సార్లు వినేలా చేస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. సుధీర్ బాబు.. హీరోయిన్ ఆనంది లుక్స్.. కూడా ఈ లిరికల్ సాంగ్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పాలి. వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఈ పాట ఉంది. సినిమాలో ఎలా పిక్చరైజ్ చేసి ఉంటారో అనే ఆసక్తిని కూడా కలిగిస్తుంది. మీరు కూడా ఓసారి వినెయ్యండి :


నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus