Balakrishna , Anil Ravipudi: అనిల్ చెప్పినా ఆ ప్రచారం ఆగడం లేదా?

  • January 27, 2023 / 09:08 PM IST

బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించగా ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. డబుల్ రోల్ లో బాలయ్య నటించిన సినిమాలు సక్సెస్ కావడంతో ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే అనిల్ రావిపూడి చాలా రోజుల క్రితమే తన సినిమాలో బాలయ్య సింగిల్ రోల్ లో కనిపిస్తాడని చాలారోజుల క్రితమే క్లారిటీ ఇచ్చారు.

బాలయ్య స్పష్టత ఇచ్చినా ఈ తరహా వార్తలు మాత్రం తరచూ ప్రచారంలోకి వస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అనిల్ మరోసారి స్పందించి క్లారిటీ ఇవ్వాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. అనిల్ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ కాకపోయినా రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలలో ఎలివేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయనే సంగతి తెలిసిందే. అనిల్ బాలయ్య కాంబో మూవీలో ఎలివేషన్ సన్నివేశాలకు లోటేం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

బాలయ్య శ్రీలీల కాంబినేషన్ లో ఎమోషనల్ సన్నివేశాలకు లోటేం లేదని సమాచారం అందుతోంది. 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలయ్య అనిల్ కాంబో మూవీ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ రానున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

బాలయ్య అనిల్ కాంబో మూవీపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో హ్యాట్రిక్ చేరనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు బాలయ్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

హంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పఠాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

సౌందర్య టు శృతి హాసన్.. సంక్రాంతికి రెండేసి సినిమాలతో పలకరించిన హీరోయిన్ల లిస్ట్..!
అతి తక్కువ రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టిన 10 తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus