Swathi: ఎన్నడూ లేని విధంగా ఇంటిమేట్ సీన్లో రెచ్చిపోయిన కలర్స్ స్వాతి!

  • October 7, 2023 / 11:04 AM IST

స్వాతి రెడ్డి అలియాస్ కలర్స్ స్వాతి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 15 ఏళ్లకే మా టీవీలో ప్రసారమయ్యే ‘కలర్స్’ అనే షోకి యాంకర్ గా చేసింది. ఈమె చలాకీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్. అందుకే క్రేజీ సినిమాల్లో ఛాన్స్ లు అందిపుచ్చుకుంది.’డేంజర్’ ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు చేసింది. ఆ తర్వాత ‘అష్టాచమ్మా’ ‘గోల్కొండ హైస్కూల్’ ‘స్వామి రారా’ ‘కార్తికేయ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఆ సినిమాలన్నీ హిట్లే. అటు తర్వాత వికాస్ వాసుని ప్రేమ వివాహం చేసుకుని విదేశాలకి చెక్కేసింది. కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన ఈ అమ్మడు గత ఏడాది ‘పంచతంత్రం’ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే ఈ సినిమా ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.

సినిమాలో ఎమోషనల్ సన్నివేశాలు, కొన్ని కామెడీ డైలాగులు ఉన్నప్పటికీ..సారైనా కథా కథనాలు లేకపోవడం వల్ల.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది అని అంతా అంటున్నారు. అయితే ఈ సినిమా ఓ విషయంలో పెద్ద షాకిచ్చింది. అదేంటి అంటే.. ఈ సినిమాలో నవీన్ చంద్ర – స్వాతి ల మధ్య ఓ డీప్ ఇంటిమేట్ సీన్ ఉంది.

గతంలో స్వాతి (Swathi) ఇలాంటి సన్నివేశాల్లో నటించింది లేదు. ఆమె నుండి ప్రేక్షకులు ఇలాంటివి ఎక్స్పెక్ట్ కూడా చేయరు. ఓ రకంగా ఆమెను అభిమానించే వారికి ఈ ఇంటిమేట్ సీన్ అనేది పెద్ద షాకిచ్చింది అనే చెప్పాలి. అంతేకాదు ఈ మధ్య స్వాతి విడాకులు తీసుకుంది అంటూ వస్తున్న వార్తలకి ఈ సన్నివేశం మరింతగా బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus