The Great Indian Suicide Review in Telugu: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రామ్ కార్తీక్ (Hero)
  • హెబ్బా పటేల్ (Heroine)
  • పవిత్రా లోకేష్, నరేష్ విజయకృష్ణ, బబ్లూ, జయప్రకాష్ తదితరులు (Cast)
  • విప్లవ్ కోనేటి (Director)
  • విప్లవ్ కోనేటి (Producer)
  • శ్రీచరణ్ పాకాల (Music)
  • అనంత్ నాగ్ - అజయ్ నాగ్ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 6, 2023

ఈ వారం థియేటర్లలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో క్రేజ్ సంపాదించుకున్న సినిమాలు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి. అయితే ఓటీటీల్లో కూడా క్రేజీ కంటెంట్ రిలీజ్ కాబోతుంది. అందులో హెబ్బా పటేల్ నటించిన ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ అనే సినిమా కూడా ఉంది.దీని ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ ఓటీటీ మూవీ పై కొంతమంది ప్రేక్షకుల దృష్టి పడింది. ఈరోజు నుండి ‘ఆహా’ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఓ లుక్కేద్దాం రండి :

కథ: హేమంత్ (రామ్ కార్తీక్) ఓ అనాథ. ఎన్నో కష్టాలు పడి ఎదిగిన అతను సొంతంగా ఓ కాఫీ షాప్ రన్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో చైత్ర (హెబ్బా పటేల్) అనే హోమ్ మేడ్ కుకీస్ సరఫరా చేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఒక మంచి రోజు చూసి ఆమెకు ప్రపోజ్ చేస్తాడు. హేమంత్ అంటే ఆమెకు కూడా ఇష్టమే..! కానీ ఆమె నో చెబుతుంది.

అంతేకాకుండా తమ కుటుంబ సభ్యులందరూ కొన్ని రోజుల్లో ఆత్మహత్య చేసుకుని చనిపోవాలనుకుంటున్నట్టు చెప్పి అతనికి ఊహించని షాక్ ఇస్తుంది. చైత్ర ఫ్యామిలీ ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది? మధ్యలో నీలకంఠం (సీనియర్ నరేష్) కి చైత్రకి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ చూడాల్సిందే.

నటీనటుల పనితీరు : హెబ్బా పటేల్ ‘ఓదెల రైల్వే స్టేషన్’ తర్వాత మరోసారి ఈ మూవీ కోసం డీ గ్లామర్ రోల్ చేసింది. చెప్పుకోవడానికి డీ గ్లామర్ రోల్ చేసింది అనే మాట తప్ప.. నటన పరంగా ఆమె కొత్తగా ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేసింది అంటూ ఏమీ లేదు. రామ్ కార్తీక్ లుక్స్ పరంగా బాగానే ఉన్నాడు. కానీ యాక్టింగ్ పరంగా అంతంత మాత్రమే. హెబ్బాకి ఇతనికి పెద్దగా జోడీ కుదిరింది లేదు. సీనియర్ నరేష్ పాత్రకి ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది.

అతని నటన గురించి కొత్తగా చెప్పాల్సింది అంటూ ఏముంది. ఇందులో కూడా చాలా బాగా నటించారు. పవిత్రా లోకేష్ కూడా బాగానే ఉంది. జయప్రకాశ్ పాత్ర బాగానే ఉంది. బబ్లూ కూడా ఓకె అనిపిస్తాడు. మిగతా నటీనటుల పాత్రలు పెద్దగా గుర్తుండవు.

సాంకేతిక నిపుణుల పనితీరు : పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘నేను నా రాక్షసి’ చిత్రం అందరికీ గుర్తుండే ఉంటుంది. అది కూడా ఆత్మహత్యల థీమ్ తో రూపొందింది. అలాగే ఢిల్లీలో జరిగిన బురారీ ఫ్యామిలీ సూసైడ్స్ ఆధారంగా రూపొందిన తమన్నా ‘ఆఖ్రి సచ్’ వెబ్ సిరీస్ ఆధారంగానే ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ ను రూపొందించాడు దర్శకుడు విప్లవ్ కోనేటి.

పాయింట్ పరంగా ఇది ఇంట్రెస్టింగ్ గా అనిపించినా కథనం మాత్రం స్లోగా సాగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ వరకు అదే ఫీలింగ్ ఉన్నా.. అక్కడి నుండి మాత్రం ట్విస్ట్ లతో సర్ప్రైజ్ చేశాడు. చాలా ఎలిమెంట్స్ ను క్లైమాక్స్ లో టచ్ చేశాడు దర్శకుడు. ఇక నేపధ్య సంగీతం, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.

విశ్లేషణ : ‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ (The Great Indian Suicide) కాన్సెప్ట్ చాలా బాగుంది. కానీ కథనం ఇంకాస్త ఎంగేజింగ్ గా ఉంటే బాగుండేది. ప్రీ క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. ఓటీటీ మూవీ కాబట్టి.. ఒకసారి ట్రై చేయొచ్చు.

రేటింగ్ : 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus