MAD Review in Telugu: మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ (Hero)
  • శ్రీగౌరి ప్రియా రెడ్డి, ఆనంతిక, గోపిక ఉదయన్ (Heroine)
  • అనుదీప్ (Cast)
  • కళ్యాణ్ శంకర్ (Director)
  • హారిక సూర్యదేవర - సాయి సౌజన్య (Producer)
  • భీమ్స్ సిసిరోలియో (Music)
  • షాందత్-దినేష్ కృష్ణన్ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 06, 2023

ప్రఖ్యాత నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఇప్పటివరకూ అన్నీ భారీ లేదా మీడియం బడ్జెట్ సినిమాలు మాత్రమే వచ్చాయి. మొదటిసారి కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ ఈ సంస్థ నిర్మించిన చిత్రం “మ్యాడ్”. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ & సాంగ్స్ టార్గెట్ ఆడియన్స్ కు రీచ్ అయ్యాయి. అలాగే.. ప్రీరిలీజ్ ఈవెంట్లో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. “”జాతిరత్నాలు” కంటే తక్కువ నవ్వితే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చేస్తాను” అని కామెంట్ చేయడం చర్చనీయాంశం అయ్యింది. మరి నాగవంశీకి సినిమా మీద ఉన్నది నమ్మకమా లేక ఓవర్ కాన్ఫిడెన్సా? సినిమా ఎలా ఉంది? వంటి ప్రశ్నలకు సమాధానం సమీక్షలో..!!

కథ: ఇంజనీరింగ్ కాలేజ్ లో జాయినైన కొన్ని రోజులకే పారిపోదామని ప్రయత్నించిన జూనియర్ ను కూర్చోబెట్టి.. అసలు కాలేజ్ లో ఎలాంటి దోస్తులు పరిచయమవుతారు? వాళ్ళ వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి? అంటూ కథ మొదలుపెట్టి.. మనోజ్ (రామ్ నితిన్), అశోక్ (నార్నే నితిన్), దామోదర్ (సంగీత్ శోభన్)ల కథ చెప్పడం మొదలెడతాడు సూపర్ సీనియర్ (విష్ణు ఓయ్).

కాలేజ్ వయసులో చేసే చిల్లర పనులు, గొడవలు, హాస్టల్ లో చేసే చిలిపి అల్లర్లకు టింగరితనం కలగలిసి వచ్చిన అవుట్ పుట్ “మ్యాడ్” చిత్ర కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో ముగ్గురు హీరోలైనప్పటికీ.. సంగీత్ శోభన్ మిగతావాళ్లందర్నీ డామినేట్ చేసేశాడు. డైలాగుల్లో అతడి ఈజ్ & కామిక్ టైమింగ్ సినిమాకి ప్లస్ అయ్యాయి. అలాగే.. మనోజ్ అనే లవర్ బోయ్ పాత్రలో రామ్ నితిన్ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక అశోక్ అనే రిచ్ కిడ్ పాత్రలో నార్నే నితిన్ నటన కంటే స్క్రీన్ ప్రెజన్స్ తో అలరించడానికి చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. ముఖ్యంగా సంగీత్ శోభన్ & రామ్ నితిన్ పక్కన నార్నే నితిన్ కనిపించలేదు. విష్ణు ఓయ్, రఘుబాబులు కూడా కామెడీ టైమింగ్ తో అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: భీమ్స్ సిసిరోలియో పాటలు యూత్ కి మంచి కిక్ ఇస్తాయి. అలాగే.. నేపధ్య సంగీతం కూడా కంటెంట్ ను ఎలివేట్ చేసేలా ఉంది. షాందత్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఎడిటింగ్ స్టైల్ సినిమాకి బాగా ప్లస్ అయ్యింది. నవీన్ నూలి కట్స్ & ఇంటర్ కట్స్ విషయంలో తీసుకున్న జాగ్రత్త సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకు తగ్గట్లుగా ఉంది. ఎక్కువ ఖర్చు లేదు, అలాగని రాజీపడలేదు. సినిమాకి కావాల్సినంత మాత్రమే ఖర్చు చేశారు.

దర్శకుడు కళ్యాణ్ శంకర్ కథ మీద కంటే డైలాగ్స్ & కామెడీ సీక్వెన్స్ ల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అవి హిలేరియస్ గా వర్కవుటయ్యాయి. ముఖ్యంగా సెకండాఫ్ మొత్తం ఎక్కడా గ్యాప్ లేకుండా ఆద్యంతం అలరించే కామెడీ సీన్స్ & డైలాగ్స్ తో సినిమాని నింపేశాడు. అందువల్ల.. ఫస్టాఫ్ లో ల్యాగ్ ఫీలైన ఆడియన్స్, సెకండాఫ్ లో ల్యాగ్ అనే మాట కూడా మర్చిపోతారు. చిన్నపాటి బూతులు ఉన్నప్పటికీ.. టార్గెట్ ఆడియన్స్ యూత్ అవ్వడం వల్ల అది కూడా ప్లస్ అవుతుంది. రచయితగా, దర్శకుడిగా కళ్యాణ్ శంకర్ ఘన విజయాన్ని అందుకున్నాడు.

విశ్లేషణ: గ్యాంగ్ తో కలిసి ఎంజాయ్ చేసే యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈమధ్యకాలంలో రాలేదు. ఆ లోటు తీర్చిన సినిమా “మ్యాడ్”. హిలేరియస్ కామెడీ సీక్వెన్స్ & సింగిల్ లైన్ పంచ్ డైలాగుల కోసం ఈ సినిమాను కచ్చితంగా ఒకసారి చూడాల్సిందే. గత నెలరోజులుగా స్లంప్ లో తెలుగు సినిమాకు “మ్యాడ్” మంచి బూస్ట్ ఇచ్చింది. అలాగే.. ఈ సినిమా ద్వారా ఎంతోమంది టాలెంటెడ్ సోషల్ మీడియా స్టార్స్ పరిచయం అవ్వడం గమనార్హం.

రేటింగ్: 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus