నిన్న పృధ్వీ,నేడు అలీ, రేపు మరి ఎవరో ?

ఎలక్షన్స్ ఇంకా నెలలో మొదలవుతున్నాయి అనగా జగన్ పార్టీలోకి ఇండస్ట్రీకి చెందిన పలువురు కామెడియన్లు, రచయితలు, నటులు, యాంకర్లు పోలోమని జాయిన్ అయిన విషయం తెలిసిందే. రోజుకొక ఆర్టిస్ట్ లేదా రైటర్ జగన్ కండువాతో కనిపించేసరికి అప్పట్లో జోకులు కూడా గట్టిగానే పేలాయి. అయితే.. ఎలక్షన్స్ లో ఎవ్వరూ ఊహించని విధంగా జగన్ గెలవడంతో అప్పటివరకూ నవ్వినవాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు.

అయితే.. జగన్ గెలిచి, అధికారంలోకి వచ్చి నెల అయినా సరే ఎలక్షన్స్ లో ఆయన తరపున ప్రచారం చేసిన వారికి జగన్ ఎలాంటి ప్రత్యేకమైన పిలుపు ఇవ్వకపోవడంతో వాళ్లందరినీ వాడుకొని వదిలేశారనుకొన్నారు. కానీ.. మొన్న 30 ఇయర్స్ పృధ్వీని “ఎస్వీబీసీ” ఛైర్మన్ గా నిర్వహించిన జగన్ ఇప్పుడు అలీని ఎమ్మెల్సీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. ఎమ్మెల్సీ మాత్రమే కాదు.. “ఎఫ్పీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్”గానూ అలీ పేరు పరిశీలనలో ఉందట. ఈ రెండు పదవులు అలీకి వస్తే గనుక.. ఇక మనోడు సినిమా ఆఫర్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం అనేది ఏమాత్రం ఉండదు. మరి ఈ తరహాలో జగన్ దగ్గర నుంచి ప్రసాదాలు అందుకొనే తదుపరి ఇండస్ట్రీ వ్యక్తి ఎవరో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus