మళ్ళీ మెగాఫ్యామిలీ పై పంచ్ లు వేసిన పృథ్వి

థర్టీ ఇయర్స్ పృథ్వి 2019 ఎన్నికల్లో వై.ఎస్.ఆర్ పార్టీ తరుపున ప్రచారం చేసి.. అందులో భాగంగా ‘జనసేన’ పార్టీ పైన అలాగే పవన్ కళ్యాణ్ పైన అనేక పంచ్ లు వేసాడు. ఓ దశలో నాగబాబు కూడా ఈ విషయం పై సీరియస్ అయ్యి వార్నింగ్ ఇచ్చారు కూడా..! ఇదిలా ఉండగా.. ఎన్నికల తరువాత పృథ్వికి అవకాశాలు బాగా తగ్గాయని.. దీనికి కారణం మెగా ఫ్యామిలీనే అని ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని ఈ మధ్యే పృథ్వి చెప్పాడు. అయితే ఇప్పుడు ఏమైందో.. మళ్ళీ పంచ్ లు వేస్తున్నాడు.

పృథ్వి మాట్లాడుతూ.. “మెగా ఫ్యామిలీ కోసం నేను ఇండస్ట్రీకి రాలేదు. ‘తాడేపల్లిగూడెం నుండి సూట్ కేస్ పట్టుకొని చెన్నైకి వెళ్ళింది మెగాహీరోలు వాళ్ళ సినిమాల్లో అవకాశాలు ఇస్తారని కాదు..’. కానీ చిరంజీవిగారంటే చాలా అభిమానం. ఆయన స్పూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పుడు ఆయనతో నటిస్తోన్న ‘సై రా’ లో నా పోర్షన్ ని ఎడిటింగ్ లో లేపేసారని వార్తలు వస్తున్నాయి. చిరంజీవిగారు అలా చేస్తారని అనుకోను. ‘ఖైదీ 150’ లో నా కామెడీ ఎపిసోడ్స్ ని డైరెక్టర్ తీసేయడంతో నేను బాగా హర్ట్ అయ్యాను. కొన్నిఇంటర్వ్యూలో ఆ ఆవేదన వ్యక్తం చేయడంతో చిరంజీవిగారు విషయం తెలుసుకొని వెంటనే ఫోన్ చేసి మళ్ళీ ఆ సీన్లను యాడ్ చేయిస్తానని చెప్పారు. కాబట్టి ‘సైరా’ విషయంలో చిరంజీవి అలా చేస్తారని అనుకోవట్లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus